Bihar : ఇటుకల బట్టీలో పేలుడు ఘటన..మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ప్రధాని మోడీ

బీహార్‌లోని మోతీహారిలో ఇటుకల బట్టీలో పేలుడు ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రధాని ఒక్కొక్కరికి రూ.2లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అలాగే గాయపడినవారికి ఒక్కొక్కరికి రూ.50వేలు ప్రకటించారు.

Bihar : ఇటుకల బట్టీలో పేలుడు ఘటన..మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ప్రధాని మోడీ

Motihari brick kiln blast nine workers died ..PM Modi announced compensation of Rs.2 lakh

Updated On : December 24, 2022 / 11:20 AM IST

Bihar  : బీహార్‌లోని మోతీహారిలో ఇటుకల బట్టీలో పేలుడు ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తంచేశారు. ఈ పేలుడు ప్రమాదంలో తొమ్మిదిమంది చనిపోయారు. పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ పేలుడు ఘటన దురదృష్టకరమని ప్రధాని విచారం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. అలాగే మృతుల కుటుంబాలకు ప్రధాని ఒక్కొక్కరికి రూ.2లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అలాగే గాయపడినవారికి ఒక్కొక్కరికి రూ.50వేలు ప్రకటించారు.

మోతీహారిలోని ఓ ఇటుకల బట్టీలో చిమ్మీ పేలిపోయింది. భారీ పేలుడు సంభవించడంతో పలువురు కార్మికులు అక్కడికక్కడే మరణించారు. మరికొందరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఇటుకల బట్టీలో తయారు చేసిన ఇటుకలను కాలుస్తారు అనే విషయం తెలిసిందే. దీంట్లో భాగంగానే అప్పటికే తయారు చేసిన మట్టి ఇటుకలను అక్కడ పనిచేసే కార్మికులు మట్టి ఇటుకలను బట్టీలో పేర్చిన తర్వాత.. దానికి నిప్పుపెట్టారు. కాసేపటికే మంటలు చెలరేగాయి. ఈ తరువాత కాసేపటికే అందరుచూస్తుండగానే చిమ్మీ పేలిపోయింది. ఈ ప్రమాదంలో తొమ్మిదిమంది కార్మికులు ప్రాణాలుకోల్పోయారు. దాదాపు మరో 20మంది వరకు తీవ్ర గాయాలు అయినట్లుగా తెలుస్తోంది. పేలుడు విధ్వంసం భారీగా జరగటంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలంలో అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పారు.

కాగా ఈ ప్రమాదం జరిగిన ఇటుక బట్టి అనుమతులు లేకుండా నడుస్తోందని అధికారులు గుర్తించారు. ఎటువంటి భద్రతా ప్రమాణాలు పాటించకుండా యజమాని ఇటుక బట్టీలను నిర్వహిస్తున్నారని గుర్తించారు. సదరు యజమానిపై చర్యలు తీసుకోనున్నారు.