PM Mann Ki Baat : మన్‌కీ బాత్ వందో ఎపిసోడ్.. నాలుగు లక్షల ప్రాంతాల్లో తెరలు.. ఐరాస కార్యాలయంలోనూ ప్రసారం..

మన్ కీ బాత్ వందో ఎపిసోడ్ ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో ప్రసారం కానుంది. భారత కాలమానం ప్రకారం.. ఆదివారం ఉదయం 11గంటలకు ప్రసారం అవుతుంది.

PM Mann Ki Baat : మన్‌కీ బాత్ వందో ఎపిసోడ్.. నాలుగు లక్షల ప్రాంతాల్లో తెరలు.. ఐరాస కార్యాలయంలోనూ ప్రసారం..

Mann ki Baat

Updated On : April 30, 2023 / 7:15 AM IST

PM Mann Ki Baat : బీజేపీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మన్‌కీ బాత్ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. తొలి ఎపిసోడ్ 2014 అక్టోబర్ 3న ప్రారంభమైంది. మనసులో మాట పేరుతో ప్రధాని ప్రతినెలా చివరి ఆదివారం ఆల్ ఇండియా రేడియోలో మన్‌కీ బాత్ పేరుతో తన సందేశాన్ని వినిపిస్తూ వస్తున్నారు. 2014లో ప్రారంభమైన ఈ కార్యక్రమం 99 ఎపిసోడ్లు పూర్తిచేసుకుంది. ఇవాళ (ఆదివారం) వందో ఎపిసోడ్ కొనసాగనుంది. ఉదయం 11గంటలకు 100వ ఎపిసోడ్ ప్రారంభమవుతుంది. ఈ వందో ఎపిసోడ్ చరిత్రలో నిలిచిపోయేలా బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

Karnataka Polls: బీజేపీకి ప్రతిష్టాత్మకంగా కర్ణాటక ఎన్నికలు.. కాంగ్రెస్‌కు అసలైన సవాల్‌ అదే..

నాలుగు లక్షల ప్రాంతాల్లో..

మనసులో మాట పేరుతో ప్రతీనెలా చివరి ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ 2014 నుంచి కొనసాగిస్తున్న మన్ కీ బాత్ కార్యక్రమం వందో ఎపిసోడ్ సుమారు కోటి మంది ప్రజలు వినినేలా బీజేపీ కనీవినీ ఏర్పాట్లు చేస్తోంది. దేశవ్యాప్తంగా ఇందుకోసం నాలుగు లక్షల ప్రాంతాల్లో తెరలు ఏర్పాటు చేయనుంది. రాజ్ భవన్ లలో, బీజేపీ పాలిత సీఎంల కార్యాలయాల్లో ప్రసారం కానున్నాయి. అంతేకాక.. పార్టీ జాతీయ అధ్యక్షుడు నుంచి పోలింగ్ కేంద్రం స్థాయి బీజేపీ నాయకుడి వరకు ఈ మన్ కీ బాత్ వందో ఎపిసోడ్ ను వినేలా ఏర్పాట్లు చేశారు.

Karnataka Polls: కాంగ్రెస్ పార్టీ నన్ను 91 సార్లు తిట్టింది.. స్వయంగా వెల్లడించిన ప్రధాని మోదీ

ఐరాస కార్యాలయంలోనూ ప్రసారం..

మన్ కీ బాత్ వందో ఎపిసోడ్ ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో ప్రసారం కానుంది. భారత కాలమానం ప్రకారం.. ఆదివారం ఉదయం 11గంటలకు ప్రసారం అవుతుంది. అదేవిధంగా లండన్ లోని భారత హైకమిషన్ లోనూ ప్రత్యేక స్క్రీనింగ్ ద్వారా వందో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేయనున్నారు. ఈ మేరకు శనివారం లండన్‌లోని భారత హైకమిషన్ ట్విట్ చేసింది.

Karnataka Polls: ఎన్నికల ముందు బిగ్ ట్విస్ట్.. దేవెగౌడ, మోదీ చర్చలు.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న బీజేపీ, జేడీఎస్!

మన్ కీ బాత్ కార్యక్రమంపై పలువురు ప్రముఖులు ఇప్పటికే ప్రశంసించారు. వందో ఎపిసోడ్ ప్రసారం అవుతున్న వేళ ప్రధాని మోదీకి మైక్రోసాప్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తన అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా అభినందనలు తెలిపారు. ఇదిలాఉంటే ఈ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని రేడియోలో కంటే ఇంటర్నెట్ ద్వారానే ఎక్కువ మంది వినట్లు గణాంకాలు చెబుతున్నాయి. రేడియలో 12శాతం, టీవీల్లో 15 శాతం, ఇంటర్నెట్ లో 37శాతం మంది ప్రధాని నరేంద్ర మోదీ ప్రతీ నెల చివరి ఆదివారం నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వింటూ వస్తున్నారు.