OBC Quota: నితీశ్ కుమార్ మాయలో చిక్కుకున్న బీజేపీ.. అంతా అయిపోయాక తల పట్టుకున్న కాషాయ నేతలు
కులగణన నివేదికపై బీహార్‌లో ఉత్కంఠ నెలకొంది. ఈ నివేదికపై బీజేపీ మొదటి నుంచి ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఈ అంశంపై నితీశ్ కుమార్ కు విపక్షాల టార్గెట్ చేశాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం నితీశ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు

Bihar Politics: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మాయలో భారతీయ జనతా పార్టీ పడిపోయింది. అయితే జరిగేది జరిగిన తర్వాత అసలు విషయం బోధపడింది. రాష్ట్ర అసెంబ్లీ ‘రిజర్వేషన్ సవరణ బిల్లు-2023’ గురువారం ఆమోదించింది. రెండు రోజుల క్రితం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ బిల్లును ఆమోదించారు. మధ్యాహ్నం అసెంబ్లీ కార్యకలాపాలు ప్రారంభం కాగానే ఏ పార్టీ వ్యతిరేకత లేకుండా ప్రభుత్వం ‘రిజర్వేషన్ సవరణ బిల్లు 2023’ని అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఇక ఏకగ్రీవంగా ఆమోదం అనంతరం, దీని మీద బీజేపీ నేతలు ప్రశ్నలు లేవనెత్తడం గమనార్హం.
కులగణన నివేదికపై బీహార్‌లో ఉత్కంఠ నెలకొంది. ఈ నివేదికపై బీజేపీ మొదటి నుంచి ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఈ అంశంపై నితీశ్ కుమార్ కు విపక్షాల టార్గెట్ చేశాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం నితీశ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ సర్వే నివేదిక తప్పని బీజేపీ చెబుతోంది. అదే సమయంలో బీజేపీ దీనికి సంబంధించి సభలో గందరగోళంలో పడింది. ఈ సర్వేను ఆధారం చేసుకునే రిజర్వేషన్ సవరణ బిల్లు 2023 ని నితీశ్ ప్రభుత్వం తీసుకువచ్చింది. అయితే దీనికి బీజేపీ మద్దతు ఇచ్చింది. అసలు వ్యతిరేకతే లేకుండా ఏకగ్రీవ ఆమోదం లభించింది. సీఎం నితీశ్ కుమార్ ఎత్తుగడలతో బీజేపీ చిక్కుల్లో పడింది.
అత్యంత వెనుకబడిన వర్గాలకు (మోస్ట్ బ్యాక్ వర్డ్ క్యాస్ట్) 65 శాతం రిజర్వేషన్లు కల్పించాలని చేసిన ప్రతిపాదనకు బిహార్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. బిహార్ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో భాగంగా ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఈ ప్రతిపాదనను మంగళవారం అసెంబ్లీ ముందు ఉంచారు. అనంతరం జరిగిన ఓటింగులో దీనికి పూర్తి స్థాయి మద్దతు లభించింది. అలాగే 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను తీసుకువచ్చిన కారణంగా, రిజర్వేషన్ మొత్తం కోటాను 75 శాతానికి పెంచాలని ఈ ప్రతిపాదన పెట్టే ముందు ఆయన అన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్ కోటా పెంచాలని నితీశ్ డిమాండ్ అన్నారు.