కేంద్ర మంత్రివర్గ కూర్పుపై ఉత్కంఠ.. టీడీపీ నేతలకు ఈ పదవులు?

Narendra Modi: స్పీకర్ పదవిని తమవద్దే ఉంచుకోవాలని బీజేపీ అనుకుంటోంది. అయితే,

కేంద్ర మంత్రివర్గ కూర్పుపై ఉత్కంఠ.. టీడీపీ నేతలకు ఈ పదవులు?

Updated On : June 6, 2024 / 2:49 PM IST

కేంద్ర మంత్రివర్గ కూర్పుపై ఉత్కంఠ నెలకొంది. కీలక శాఖలు బీజేపీ వద్దే ఉండే అవకాశం ఉంది. హోంశాఖ, రక్షణ, విదేశాంగ, ఆర్థిక, రోడ్లు, రైల్వే శాఖలు బీజేపీ నేతలకే దక్కుతాయని తెలుస్తోంది. వ్యవసాయం, మౌలిక వసతులు, సంక్షేమ రంగాలపై పట్టు వదులుకోకూడదని బీజేపీ భావిస్తోంది.

స్పీకర్ పదవిని తమవద్దే ఉంచుకోవాలని బీజేపీ అనుకుంటోంది. అయితే, డిప్యూటీ స్పీకర్ పదవిని టీడీపీకి ఇచ్చే అవకాశం ఉంది. అలాగే, మంత్రి వర్గంలో పౌరవిమాన శాఖ, ఉక్కు శాఖ టీడీపీకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. గ్రామీణాభివృద్ధి, పంచాయతి రాజ్ శాఖలు జేడీయూకి ఇవ్వచ్చని ప్రచారం జరుగుతోంది. భారీ పరిశ్రమల శాఖను శివసేనకు ఇచ్చే అవకాశం ఉంది.

ఇక వ్యవసాయ శాఖను జేడీఎస్‌కు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మెజారిటీ బీజేపీకి రాలేదన్న విషయం తెలిసిందే. దీంతో ఈ సారి ఎన్డీఏలోని ఇతర పార్టీలకూ కేంద్ర మంత్రి వర్గంలో అధిక ప్రాధాన్యం దక్కనుంది.

Also Read: అధికారపార్టీ ఒత్తిళ్లతో పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారిపోయింది: ప్రతిపక్ష నేతగా జగన్ ట్వీట్