BJP MP : బీజేపీ ఎంపీ ఇంటిపై బాంబుదాడి.

పశ్చిమ బెంగాల్ లో బాంబుల మోతమోగింది. బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ ఇంటి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు బాంబులు విసిరారు.

BJP MP : బీజేపీ ఎంపీ ఇంటిపై బాంబుదాడి.

Bjp Mp

Updated On : September 8, 2021 / 11:19 AM IST

BJP MP : పశ్చిమ బెంగాల్ లో బాంబుల మోతమోగింది. బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ ఇంటి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు బాంబులు విసిరారు. ఈ దాడిలో ఇంటి ముందు గేట్లు పాక్షికంగా స్వంసమైనట్లు తెలుస్తోంది. బుధవారం ఉదయం బైక్ పై వచ్చిన ముగ్గురు దుండగులు కోల్‌కతాలోని ఎంపీ నివాసం ముందు బాంబులు విసిరారు. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడమతొ ఊపిరి పీల్చుకున్నారు.

ఇక ఈ ఘటన విషయాన్నీ పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధంకర్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఎంపీ అర్జున్ సింగ్ ఇంటి ముందు బాంబు పేలుళ్ల ఘటన జరిగిందని, ఇది ఆందోళనకరంగా ఉందని గవర్నర్ ట్వీట్ చేశారు. ఎంపీ ఇంటి ముందు బాంబు పేలుళ్ల ఘటనకు పాల్పడింది తృణమూల్ కాంగ్రెస్ అని బీజేపీ ఆరోపిస్తున్నది. ఈ ఘటనతో కోల్‌కతాలోని ఇంటితోపాటు నార్త్ 24 పార్గనాస్ వద్ద ఉన్న ఇంటికి కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న ఎంపీ ఢిల్లీ నుంచి కోల్‌కతా బయలుదేరారు.