LOCలో పాక్ కాల్పులు…ముగ్గురు జవాన్లు,3పౌరులు మృతి

  • Published By: venkaiahnaidu ,Published On : November 13, 2020 / 04:05 PM IST
LOCలో పాక్ కాల్పులు…ముగ్గురు జవాన్లు,3పౌరులు మృతి

Updated On : November 13, 2020 / 4:42 PM IST

BSF Soldier Killed In Action In Pakistani Firing Along LoC In J&K మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది పాకిస్తాన్. శుక్రవారం జమ్ముకశ్మీర్ లోని​ బారాముల్లా జిల్లాలో నియంత్రణ రేఖ(LoC) వెంబడి పాక్ కాల్పులకు తెగబడింది. ఈ కాల్పుల్లో ముగ్గురు జవాన్లు వీరమరణం పొందారని భారత ఆర్మీ తెలిపింది. పాక్ జరిపిన కాల్పుల్లో ముగ్గురు పౌరులు కూడా మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మరో పౌరుడికి తీవ్రగాయాలయ్యాయని తెలిపారు.


మరోవైపు, పూంచ్ జిల్లాల్లోని సావ్ జియాన్ లో పాక్ జరిపిన షెల్లింగ్ దాడిలో ఏడుగురు పౌరులు మరణించినట్లు అధికారులు తెలిపారు. సరిహద్దుల్లో ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయని, బీఎస్​ఎఫ్ ఇందుకు దీటుగా స్పందిస్తోందని సీనియర్ ఆర్మీ అధికారి పేర్కొన్నారు. పాక్ వైపు కూడా పలువురు జవాన్లు మరణించినట్లు అధికారులు తెలిపారు.