33 ఏళ్ల నుంచి చాయ్ తాగి బతికేస్తోంది

కేవలం టీ మాత్రమే తాగుతు సంవత్సరాల తరబడి బ్రతికటం గురించి విన్నారా..అదికూడా ఎంతో ఆరోగ్యం వుండటం. కొంతమంది కేవలం నీరు మాత్రమే తాగి బతుకుతుంటారని విన్నాం. ఈమె మాత్రం గత 33 సంవత్సరాల నుండి కేవలం టీ మాత్రమే తాగి ఎంతో ఆరోగ్యం బతికేస్తోంది. ఆమే పిల్లి దేవి.

  • Published By: veegamteam ,Published On : January 23, 2019 / 09:17 AM IST
33 ఏళ్ల నుంచి చాయ్ తాగి బతికేస్తోంది

కేవలం టీ మాత్రమే తాగుతు సంవత్సరాల తరబడి బ్రతికటం గురించి విన్నారా..అదికూడా ఎంతో ఆరోగ్యం వుండటం. కొంతమంది కేవలం నీరు మాత్రమే తాగి బతుకుతుంటారని విన్నాం. ఈమె మాత్రం గత 33 సంవత్సరాల నుండి కేవలం టీ మాత్రమే తాగి ఎంతో ఆరోగ్యం బతికేస్తోంది. ఆమే పిల్లి దేవి.

బరాదియా :  మనం ఉదయం టిఫిన్‌, మధ్యాహ్నం, మళ్లీ రాత్రీ భోజనం లాగించేస్తాం. మరి మనం బ్రతకాలంటే ఆహారం తినాలి కదా.. ఆ తినే ఆహారంలో కూడా ఎన్నో రకాలు. సమతులాహారం, పౌష్టికాహారం. ఇలా ఎవరికి వారు వారికిష్టమైనవి..తింటుంటారు. కేవలం టీ మాత్రమే తాగుతు సంవత్సరాల తరబడి బ్రతికటం గురించి విన్నారా..అదికూడా ఎంతో ఆరోగ్యం వుండటం. కొంతమంది యతులు గాలి పీల్చి బ్రతుకుతుంటారని విన్నాం.. ఈమె మాత్రం గత 33 సంవత్సరాల నుండి కేవలం టీ మాత్రమే తాగి ఎంతో ఆరోగ్యం బతికేస్తోంది. ఆమే పిల్లి దేవి.
 

ఛత్తిస్‌గఢ్‌ రాష్ట్రంలోని కొఠియా జిల్లా బరాదియా గ్రామానికి చెందిన పిల్లి దేవిని ఆ ఊరిలో ఆమెను అందరూ ‘చాయ్‌ వాలీ చాచీ’ అని పిలుస్తారు. ఎందుకంటే ఆమె 33 ఏళ్లుగా కేవలం చాయ్‌ మాత్రమే తాగుతోందని ఊరివారంతా ఆ  పేరు పెట్టారట. ఆమెకు బ్రేక్‌ ఫాస్ట్‌, లంచ్‌, డిన్నర్‌ అన్నీ టీనే.11 ఏళ్ల వయసులో ఆహారాన్ని తీసుకోవడం మానేసిన పిల్లి దేవి వయసు ఇప్పుడు 44 ఏళ్లు. 33 ఏళ్లుగా ఎటువంటి ఆహారం తీసుకోకపోయినా పూర్తి ఆరోగ్యంగా ఉండడం మరో ప్రత్యేకత. పిల్లిదేవి ఆరో తరగతిలో ఉండగా తిండి తినడం మానేసిందని దేవి తండ్రి రతీరామ్ చెప్పారు. ‘జనక్ పూర్ లోని పాట్నా పాఠశాలలో జిల్లా స్థాయి క్రీడా పోటీలు జరిగాయి. ఆ పోటీల్లో దేవి పాటిస్పేట్ చేసింది. అక్కడికి వెళ్లి వచ్చినప్పటి నుంచి కొన్ని రోజుల పాటు టీతో బిస్కెట్లు, బ్రెడ్ తినేదనీ..ఆ తర్వాతనుంచి అవికూడా మానేసి కేవలం బ్లాక్ టీ తాగుతోందన్నారు. ఇప్పుడామె సూర్యాస్తమయం తర్వాత ఒక  కప్పు బ్లాక్ టీ మాత్రం తాగుతుందని..రోజంతా పూజలోనే గడుపుతుందని..చాలా అరుదుగా మాత్రమే ఇంటి నుంచి బైటకు రాదని తెలిపారు.

దీంతో మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలు ఉన్నాయేమోనని భయపడి ఆమెను డాక్టర్ల  వద్దకు తీసుకెళ్లామనీ..కానీ ఆరోగ్యం చాలా బాగుందని డాక్టర్స్ చెప్పారట.మనుషులు కేవలం టీ తాగి బతకడం అసాధ్యమని, 33 ఏళ్లుగా ఆమె టీతో జీవించడం చాలా అరుదనీ కొఠియా జిల్లా ఆసుపత్రి డాక్టర్  ఎస్.కె.గుప్తా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.