Chandrayaan-3 Launch : నింగిలోకి దూసుకెళ్లేందుకు సిద్ధమైన చంద్రయాన్-3.. చంద్రయాన్-2కు చంద్రయాన్-3కి తేడా ఏమిటో తెలుసా? లక్ష్యాలు ఏమిటంటే..

ఇస్రోకు అత్యంత ప్రతిష్టాత్మకమైన చంద్రయాన్ -3 నింగిలోకి దూసుకెళ్లేందుకు సిద్ధమైంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.35 గంటలకు ఎల్‌వీఎం-3 ఎం4 రాకెట్ భారతీయుల ఆశలు, ఆకాంక్షలను మోస్తూ నింగిలోకి దూసుకెళ్లనుంది.

Chandrayaan-3 Launch : నింగిలోకి దూసుకెళ్లేందుకు సిద్ధమైన చంద్రయాన్-3.. చంద్రయాన్-2కు చంద్రయాన్-3కి తేడా ఏమిటో తెలుసా? లక్ష్యాలు ఏమిటంటే..

Chandrayaan-3 Launch

Updated On : July 14, 2023 / 3:01 PM IST

Chandrayaan-3 Launch : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు అత్యంత ప్రతిష్టాత్మకమైన చంద్రయాన్ -3 నింగిలోకి దూసుకెళ్లేందుకు సిద్ధమైంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.35 గంటలకు ఎల్‌వీఎం-3 ఎం4 రాకెట్ భారతీయుల ఆశలు, ఆకాంక్షలను మోస్తూ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ ప్రయోగం విజయవంతం అయితే, వచ్చే నెలలో చంద్రయాన్ -3 జాబిల్లి దక్షిణ ధ్రువం వద్ద దిగితే ఆ ఘనత సాధించిన తొలి దేశంగా, చంద్రుడిపై సాప్ట్ ల్యాండింగ్‌ను సాధించిన నాలుగో దేశంగా భారత్ గుర్తింపు పొందనుంది.

Chandrayaan-3: చంద్రయాన్-2 కంటే చంద్రయాన్-3 గొప్పేంటీ? రెండింటి మధ్య ఆ 5 తేడాలివే..

ప్రయోగం ఎక్కడ.. ఎలా..?

తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి చంద్రయాన్ -3ని నింగిలోకి పంపించనున్నారు. గురువారం మధ్యాహ్నమే రాకెట్ కౌంట్‌డౌన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇది నిరంతరాయంగా 25.30 గంటలపాటు కొనసాగనుంది. శుక్రవారం మధ్యాహ్నం సరిగ్గా 2గంటల 35 నిమిషాల 13 సెకన్లకు రెండో ప్రయోగవేదిక నుంచి చంద్రయాన్ -3 తో కూడిన ఎల్‌వీఎం-3 ఎం4 వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లనుంది. అత్యంత శక్తిమంతమైన ఈ రాకెట్ ద్వారా ల్యాండర్, రోవర్, ప్రోపల్షన్ మాడ్యూల్ తో కూడిన చంద్రయాన్ -3ని ప్రయోగిస్తారు. చంద్రయాన్ -3ని భూమి చుట్టూఉన్న 170X 36,500 కిలోమీటర్ల దీర్ఘవృత్తాకార కక్ష్యలో రాకెట్ ప్రవేశపెడుతుంది. అది 24 రోజులు భూమి చుట్టూ తిరుగుతుంది. క్రమంగా కక్ష్యను పెంచుతారు. ఈ విన్యాసాలను ట్రాన్స్‌లూనాల్ ఇంజెక్షన్స్ (టీఎల్ఐ)గా పేర్కొంటారు. ఆగస్టు 23 లేదా 24న ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్, రోవర్ తో కూడిన మాడ్యూల్ విడిపోతుంది. అది గంటకు 6వేల కిలో మీటర్ల వేగంతో జాబిల్లి ఉపరితలం దిశగా దూసుకెళ్తుంది. నాలుగు ఇంజన్ల ససాయంతో వేగాన్ని క్రమంగా తగ్గించుకుంటుంది.

Chandrayaan-3 Launch: చంద్రయాన్ -3 ప్రయోగం లైవ్‌లో చూడాలనుకుంటున్నారా? అయితే ఇలా చేయండి ..

ఆ రెండిటి మధ్య  తేడాలివే..

ఇస్రో గతంలో ప్రయోగించిన చంద్రయాన్-2 ప్రయోగం విఫలమైంది. పలుమార్పులు చేసిన అనంతరం చంద్రయాన్ -3ని చంద్రుడిపైకి పంపించేందుకు ఇస్రో సిద్ధమైంది. అయితే, ఈ రెండింటికి అనేక తేడాలున్నాయి. చంద్రయాన్ -2 మొత్తం బరువు 3,850 కిలోలు. అందులో ఆర్బిటల్, ల్యాండర్, రోవర్ ఉన్నాయి. ఆర్బిటల్ జీవితకాలం ఏడాది. ల్యాండర్, రోవర్ జీవిత కాలం ఒక లూనార్ డే. ఈ వాహన నౌక వ్యయం రూ. 970కోట్లు.

చంద్రయాన్ -3 మొత్తం బరువు 3,900 కిలోలు. అందులో ప్రొపల్సన్ మాడ్యూల్, ల్యాండర్, రోవర్ ఉన్నాయి. ల్యాండర్, రోవర్ జీవిత కాలం ఒకలూనార్ డే. ఈ వాహకనౌక వ్యయం రూ. 615 కోట్లు. అయితే, చంద్రయాన్ -2 వైఫల్యాలను సరిదిద్దుకొని చంద్రయాన్-3ని విజయవంతంగా నింగిలోకి పంపించేందుకు ఇస్రో సిద్ధమైంది.

Chandrayaan-3: చంద్రుడిపై పరిశోధనలు చేయడానికి ఇన్ని రకాల మిషన్లా?.. ఇవి అత్యద్భుతం కదా?

చంద్రయాన్ -3 లక్ష్యాలివే..

తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి చంద్రయాన్ -3 నింగిలోకి దూసుకెళ్తుంది. ఈ ప్రయోగం ద్వారా చందమామ ఉపరితలంపై సురక్షితంగా, మృదువుగా ల్యాండ్ అయ్యే సామర్థ్యం భారత్ కు ఉందని చాటాలని భావిస్తుంది. అదేవిధంగా జాబిల్లిపై రోవర్‌ను నడపగలమని రుజువు చేయాలని ఇస్రో పట్టుదలతో ఉంది. చంద్రయాన్-3లోని పరికరాల ద్వారా చంద్రుడి ఉపరితలంపై అక్కడికక్కడే శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించడం ఈ ప్రయోగం యొక్క లక్ష్యం.

చంద్రయాన్ -3 విశేషాలు ..
చంద్రయాన్ -3 బరువు 3,900 కిలోలు.
ఇందులో ప్రొపల్షన్ మాడ్యూల్ : 2,148 కిలోలు.
ల్యాండర్, రోవర్ :1,752 కిలోలు.
ప్రాజెక్టు వ్యయం : రూ.613 కోట్లు.
ఎల్ వీఎం-3 ఎం4 రాకెట్ పొడవు : 44.5 మీటర్లు
వ్యాసం : 4 మీటర్లు
లిఫ్టాప్ బరువు : 640 టన్నులు
దశలు : మూడు
పేలోడ్ సామర్థ్యం : దిగువ భూ కక్ష్యలోకి 8వేల కిలోలు.
భూస్థిర బదిలీ కక్ష్యలోకి : 4వేల కిలో మీటర్లు