బలవంతంగా కాంగ్రెస్‌కి ఓటు వేయిస్తున్నారు : రాహుల్‌పై స్మృతీ ఇరానీ సంచలన ఆరోపణలు

బీజేపీ నేత, అమేథీ లోక్ సభ ఎంపీ అభ్యర్థి స్మృతీ ఇరానీ.. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీపై సంచలన ఆరోపణలు చేశారు. అమేథీలో రాహుల్ గాంధీ ఓట్లు దొంగలిస్తున్నారని ఆరోపించారు.

  • Published By: veegamteam ,Published On : May 6, 2019 / 06:05 AM IST
బలవంతంగా కాంగ్రెస్‌కి ఓటు వేయిస్తున్నారు : రాహుల్‌పై స్మృతీ ఇరానీ సంచలన ఆరోపణలు

Updated On : May 6, 2019 / 6:05 AM IST

బీజేపీ నేత, అమేథీ లోక్ సభ ఎంపీ అభ్యర్థి స్మృతీ ఇరానీ.. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీపై సంచలన ఆరోపణలు చేశారు. అమేథీలో రాహుల్ గాంధీ ఓట్లు దొంగలిస్తున్నారని ఆరోపించారు.

బీజేపీ నేత, అమేథీ లోక్ సభ ఎంపీ అభ్యర్థి స్మృతీ ఇరానీ.. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీపై సంచలన ఆరోపణలు చేశారు. అమేథీలో రాహుల్ గాంధీ ఓట్లు దొంగలిస్తున్నారని ఆరోపించారు. అమేథీలో  బూత్ క్యాప్చరింగ్ కి కాంగ్రెస్ పాల్పడుతోందన్నారు. 316వ నెంబర్ పోలింగ్ బూత్ లో కాంగ్రెస్ కు ఓటు వేయాలని కాంగ్రెస్ ఏజెంట్లు ఓటర్లను ఒత్తిడి చేశారని ఇరానీ చెప్పారు. ఓ వృద్ధురాలు బీజేపీకి ఓటు వేయాలని అనుకుందని, కానీ కాంగ్రెస్ ఏజెంట్లు ఆమెతో బలవంతంగా కాంగ్రెస్ గుర్తుకి ఓటు వేయించారని స్మతీ ఇరానీ ఆరోపించారు. ఈ మేరకు సాక్ష్యంగా ఆమె ఓ  ఓటర్ వీడియోను ట్వీట్ చేశారు.

పోలింగ్ బూత్ లో ఏజెంట్లు… తనతో బలవంతంగా కాంగ్రెస్ గుర్తుకి ఓటు వేయించారని ఆ వీడియోలో వృద్ధురాలు చెప్పడం ఉంది. దీనిపై ఈసీ చర్యలు తీసుకుంటుందని తాను భావిస్తున్నట్టు స్మృతీ ఇరానీ చెప్పారు. ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తున్న రాహుల్ గాంధీని శిక్షించాలా వద్దా అనేది ప్రజలే నిర్ణయించుకోవాలని స్మృతీ ఇరానీ అన్నారు. అమేథీలో కాంగ్రెస్ అభ్యర్థిగా రాహుల్ గాంధీ, బీజేపీ అభ్యర్థిగా స్మృతీ ఇరానీ బరిలో ఉన్నారు.

సాధారణంగా తాము పోటీ చేస్తున్న నియోజకవర్గంలో పోలింగ్ జరిగే సమయంలో అభ్యర్థులు అక్కడే ఉంటారు. పోలింగ్ ఎలా జరుగుతోంది, పోలింగ్ బూత్ ల దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది, ఓటర్లకు సరైన సదుపాయాలు కల్పించారా లేదా అనేది అభ్యర్థులు పరిశీలిస్తారు. కానీ రాహుల్ ఇందుకు భిన్నంగా వ్యవహరించారు. అసలు రాహుల్ గాంధీ అమేథీకి వెళ్లలేదు. దీన్ని స్మృతీ ఇరానీ ప్రస్తావించారు. అసలు రాహుల్ గాంధీ అమేథీలో ఎందుకు లేరని ప్రశ్నించారు. బూత్ క్యాప్చరింగ్ కు పాల్పడే దిశగా.. కాంగ్రెస్ పార్టీ.. ఏజెంట్లను మోహరించిందని.. అందుకే రాహుల్ గాంధీ అమేథీలో లేరని స్మృతీ ఇరానీ ఆరోపించారు.