Corona Vaccination: కరోనా ప్రికాషన్ డోస్ అపాయింట్మెంట్లు ప్రారంభం

జనవరి 10 నుంచి ప్రికాషనరీ డోసు పంపిణీ చేయనుండగా శనివారం నుంచి ముందస్తు రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి. ఆన్ లైన్ లో కోవిన్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు

Corona Vaccination: కరోనా ప్రికాషన్ డోస్ అపాయింట్మెంట్లు ప్రారంభం

Covid

Updated On : January 8, 2022 / 8:38 AM IST

Corona Vaccination: దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరోనా కొత్త రకం వేరియంట్ ఓమిక్రాన్ సైతం దేశంలో తీవ్ర వ్యాప్తిలో ఉంది. రెండు డోసుల కరోనా వాక్సిన్ తీసుకున్న వారిలోనూ కోవిడ్ లక్షణాలు బయటపడడం కొంత ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యంగా వృద్ధుల్లో కరోనా వ్యాప్తి అధికంగా ఉందని గుర్తించిన ఐసీఎంఆర్.. వారు ప్రికాషనరీ డోసు తీసుకోవడం మంచిదని సూచించింది. ఈక్రమంలో కేంద్ర వైద్యారోగ్యశాఖ సైతం.. కోవిడ్ నుంచి రక్షణ పొందేందుకు ప్రజలు ప్రికాషనరీ డోసు తీసుకోవచ్చంటూ ప్రకటించింది. అయితే మొదటి ప్రాధాన్యతగా ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్లు. 60 ఏళ్లు దాటిన వృద్ధులకు ప్రికాషన్ డోసు ఇవ్వాలని సూచించింది.

Also read: Sonu Sood: ఎన్నికల సంఘం ప్రచారకర్తగా తప్పుకున్న సోనూసూద్

జనవరి 10 నుంచి ప్రికాషనరీ డోసు పంపిణీ చేయనుండగా శనివారం నుంచి ముందస్తు రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి. ఆన్ లైన్ లో అపాయింట్మెంట్ తీసుకోదలచిన వారు శనివారం నుంచి కోవిన్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని కేంద్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. అయితే ఇప్పటికే రెండు డోసుల కరోనా వాక్సిన్ తీసుకున్నవారు.. ప్రికాషనరీ డోసు కోసం ప్రత్యేకంగా అపాయింట్మెంట్ తీసుకొనవసరం లేదని, వారు నేరుగా టీకా కేంద్రానికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకుని వాక్సిన్ తీసుకోవచ్చని సూచించింది.

Also read: Terrorist Encounter: ఆ ముగ్గురు ఉగ్రవాదులు జైషే ఈ మహ్మద్ సంస్థకు చెందిన వారు