కరోనా కేసుల్లో రష్యాను దాటేసి మూడో స్థానానికి చేరిన ఇండియా

కరోనావైరస్ తో బాధపడుతున్న రాష్ట్రాల్లో ఇండియా.. రష్యాను దాటేసి మూడో స్థానానికి చేరింది. ఆదివారం సాయంత్రానికి 6.9లక్షల కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందిన సమాచారం ప్రకారం.. 6.8లక్ష కేసులతో ఉన్న రష్యాను దాటేసిందని అమెరికాకు చెందిన జాన్స్ హాప్ కిన్స్ యూనివర్సిటీ చెబుతుంది.
ఇండియా ప్రస్తుతం బ్రెజిల్, అమెరికా కంటే వెనుకే ఉంది. బ్రెజిల్ లో 15లక్షలు కేసులు ఉండగా అమెరికాలో 28లక్షలకు పైగానే ఉన్నాయి. ఆదివారం ఇండియా రికార్డు స్థాయిలో కరోనా కేసులను సృష్టించింది. గడిచిన 24గంటల్లో 25వేల కేసులు నమోదుకాగా అందులో 613మృతులు ఉన్నాయి. జనవరి తర్వాత ఒకేరోజు ఇంతలా పెరగడం ఇదే తొలిసారి.
ప్రస్తుతం మృతుల సంఖ్య 19వేల 268గా ఉంది. వెస్టరన్, సదరన్ పార్ట్స్ లో అధిక వర్షం పడుతుండగా ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో దారుణమైన నష్టం జరిగింది. ఒక్క ముంబైలోనే 7వేల కొత్త కేసులు నమోదయ్యాయి. తమిళనాడు, ఢిల్లీలలో 4వేల 200, 2వేల 500తాజా కేసులు నమోదయ్యాయి.
అత్యంత కఠినంగా మార్చి నెలలో లాక్‌డౌన్ అమలుపరిచిన దేశాల్లో ఇండియా ఒకటి. ఢిల్లీ, తమిళనాడులలో రికార్డు స్థాయిలో తాజా కేసులు నమోదవడంతో అప్పట్లో ఆనిర్ణయం తీసుకున్నారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి తీసుకున్న నిర్ణయం ఆర్థికపరంగా ఘోరమైన దెబ్బ తగిలింది.
సిటీల్లోని స్కూళ్లు, మెట్రో టైన్లు, సినిమాలు, జిమ్ లు, స్విమ్మింగ్ పూల్స్ ఇంకా మూసే ఉంచారు. అంతర్జాతీయ విమానాల రాకపోకలు నిలిపివేశారు. పబ్లిక్ ప్లేసుల్లో మాస్క్ లు తప్పనిసరి చేశారు. షాపులు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో భారీ సంఖ్యలో గుంపులు అవడాన్ని నిషేదించారు.