Covid -19 Cases: దేశంలో 60వేలు దాటిన కొవిడ్ యాక్టీవ్ కేసుల సంఖ్య.. 24 గంటల్లో 27 మంది మృతి ..

రోజువారి కొత్త కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా కొత్త కేసుల సంఖ్యతో కలుపుకొని దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 60,313కు చేరింది.

Covid -19 Cases: దేశంలో 60వేలు దాటిన కొవిడ్ యాక్టీవ్ కేసుల సంఖ్య.. 24 గంటల్లో 27 మంది మృతి ..

Corona test

Covid -19 Cases: భారతదేశం (India) లో కొవిడ్ -19 (Covid-19)  ఉధృతి కొనసాగుతూనే ఉంది. గత నెల రోజులుగా రోజువారి కేసుల సంఖ్య పెరుగుతోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ (Union Ministry of Health) సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 9,111 కొత్త కొవిడ్ కేసులు (New covid cases) నమోదయ్యాయి. అయితే, గత నాలుగు రోజులుగా 10వేలకుపైగా కొవిడ్ కొత్త కేసులు నమోదు కావటంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమైంది. శుక్రవారం 11వేలకుపైగా, శనివారం 10,753, ఆదివారం 10,093 కొత్త కేసులు నమోదయ్యాయి. సోమవారం 9వేలకు మాత్రమే కొత్తకేసుల సంఖ్య పరిమితం కావటం కొంత ఊరటనిచ్చే విషయం.

Covid-19 Cases: స్వల్పంగా తగ్గిన కొవిడ్ కేసులు.. 57వేలు దాటిన యాక్టివ్ కేసుల సంఖ్య

రోజువారి కొత్త కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా కొత్త కేసుల సంఖ్యతో కలుపుకొని దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 60,313కు చేరింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 4.48 కోట్ల కొవిడ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 27 మంది కరోనాతో చికిత్స పొందుతూ మరణించారు. దీంతో దేశంలో ఇప్పటి వరకు కొవిడ్ తో మరణించిన వారి సంఖ్య 5.31లక్షలకు చేరింది.

COVID-19 Cases: శుభవార్తే అయినా.. అప్రమత్తంగా ఉండాల్సిందే..! భారత్‌లో వచ్చే పది రోజులు కోవిడ్ ఉద్ధృతి.. ఆ తరువాత..

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. కరోనా కేసుల రోజువారీ సానుకూలత 8.40 శాతంగా నమోదు కాగా, వారం వారీ సానుకూలత రేటు 4.94 శాతంగా ఉంది. మొత్తం కొవిడ్ కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.13శాతంగా ఉంది. దేశంలో కొవిడ్ కేసుల రికవరీ రేటు 98.68శాతంగా నమోదైంది. మరణాల రేటు 1.19 శాతంగా నమోదైంది. దేశంలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు దేశంలో 220.66 కోట్ల కొవిడ్ వ్యాక్సిన్ డోస్ ఇచ్చారు.