మోడీ ఇలాకాలో కాంగ్రెస్ సమర భేరి : నేడే సీడబ్ల్యూసీ సమావేశం 

  • Published By: chvmurthy ,Published On : March 12, 2019 / 06:16 AM IST
మోడీ ఇలాకాలో కాంగ్రెస్ సమర భేరి : నేడే సీడబ్ల్యూసీ సమావేశం 

అహమ్మదాబాద్ : మోడీ ఇలాకాలో కాంగ్రెస్ పార్టీ సార్వత్రిక ఎన్నికల సమరభేరి మోగించబోతోంది. 58 ఏళ్ల తర్వాత తొలిసారిగా అహ్మదాబాద్ లో కాంగ్రెస్ సిడబ్ల్యూసీ భేటీ ఏర్పాటు చేసుకుంది. ఈ సమావేశం తర్వాత సభ జరగనుంది. ఏఐసిసి జనరల్ సెక్రటరీ హోదాలో తొలిసారిగా ప్రియాంకగాంధీ కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. అటు గుజరాత్ పటీదార్ ఉద్యమనేత హార్దిక పటేల్ కూడా కాంగ్రెస్‌లో ఇవాళే జాయిన్ అవనున్నారు. దీంతో గుజరాత్ నుంచే కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తూ బిజెపికి సవాల్ విసురుతున్నట్లైంది. 

మంగళవారం ఉదయం సబర్మతీ ఆశ్రమంలో ఒక ప్రార్ధనా సమావేశం కూడా నిర్విహించారు.  అనంతరం సర్దార్ వల్లభాయ్ పటేల్ స్మారక భవనంలో పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో  సమావేశం ప్రారంభం అవుతుంది. 22 మంది కీలక సభ్యులు, 15 మంది శాశ్వత ఆహ్వానితులు 9 మంది ప్రత్యేక ఆహ్వానితులు ఈ సమావేశానికి హజరయ్యారు. ఈ సమావేశానికి యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా  గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, గులాం నబీ ఆజాద్ , అహ్మద్ పటేల్ తో సహా  వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు ,మాజీ ముఖ్యమంత్రులు  హాజరయ్యారు.

ప్రధానంగా మోడీ 5 ఏళ్ల పాలనా వైఫల్యాలు, దేశ భద్రత,రైతు సమస్యలు,దళితులు,ఆదివాసీల సమస్యలతో పాటు దేశంలో పెరిగిపోయిన నిరుద్యోగం వంటి వాటిపై  సీడబ్ల్యూసీలో చర్చించి సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన ఎజెండాగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం చేయనుంది. జై జవాన్ జై కిసాన్  అంటూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం చేయబోతోంది. 2019  సార్వ్రత్రిక ఎన్నికలముందు జరిగే చివరి సీడబ్ల్యూసీ మీటింగ్ ఇది. కాంగ్రెస్పార్టీ 2009-14 లో కాంగ్రెస్ పార్టీ అవినీతి మయం అయ్యిందని బీజేపీ ప్రజల్లోకి తీసుకువెళ్లగలిగింది. ఇప్పుడు 2019  ఎన్నికల్లో బీజేపీ ని  దెబ్బతీయటానికి రాఫెల్ డీల్  ఒక్కటే ప్రస్తుతం  కాంగ్రెస్ ముందు ఉన్న ఆయుధం.  నేటి సమావేశంలో ఫ్యూచర్ ఇండియా పై కాంగ్రెస్ పార్టీ  పలు కీలక నిర్ణయాలను తీసుకోనుంది.  సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటికే 15  మంది అభ్యర్ధుల పేర్లు పార్టీ ప్రకటించింది. వీరిలో ఉత్తర ప్రదేశ్లోని 11 స్దానాలకు గుజరాత్ లోని నాలుగు స్ధానాలకు  పేర్లు ప్రకటించారు.2019 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదించ బోతోంది.