ప్రేమను వద్దన్నాడని దత్త పుత్రిక లవర్ చేతిలో హత్య

ప్రేమను వద్దన్నాడని దత్త పుత్రిక లవర్ చేతిలో హత్య

Updated On : December 6, 2020 / 8:37 PM IST

Murder: దేశ రాజధాని ఢిల్లీలో మరో షాకింగ్ ఘటన జరిగింది. దత్త పుత్రిక లవర్ 50ఏళ్ల వ్యక్తిని హత్య చేశాడు. కొద్ది రోజులుగా కూతురితో రిలేషన్ లో ఉన్నందుకు వారించడంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఢిల్లీలోని సోనీ విహార్ ప్రాంతంలో వీరేందర్ సింగ్ అలియాస్ పప్పు అనే వ్యక్తి భార్య గుడికి వెళ్లి వస్తుండగా తన భర్త హత్య చూసి షాక్ అయింది.

గుడికి వెళ్లి వస్తున్న మహిళ సూరజ్ అనే నిందితుడు ఇంట్లో నుంచి బయటకు పరిగెత్తడం గమనించింది. ఆ తర్వాత తలపై పలుమార్లు గాయం అయి ఉండటంతో పాటు రక్తపు మడుగులో పడి ఉన్నట్లు గుర్తించింది. ఈ ఘటన పట్ల పోలీసులకు ఇన్ఫర్మేషన్ అందించగా సెక్షన్ 302ప్రకారం.. అతనిపై పోలీస్ కేస్ ఫైల్ చేశారు.



ఎంక్వైరీలో బాధితుడు తన అన్న కూతురినే దత్తత తీసుకున్నట్లు తేలింది. ఆమె ఇంటికి దగ్గర్లో ఉండే సూరజ్‌తో రిలేషన్‌షిప్‌లో ఉంది. ఆ విషయం తెలుసుకున్న వ్యక్తి యువతిని సొంతూరుకు పంపించేశాడు.

‘స్థానికులు, కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం.. సూరజ్ అతని కూతురిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. తాను బతికి ఉండగా అలాంటివి జరగవని ఇంకెప్పుడూ తన కూతురిని కలవొద్దంటూ వార్నింగ్ ఇచ్చాడు’ అని ఇంగ్లీష్ మీడియా చెప్పింది. నిందితుడ్ని పట్టుకునేందుకు పోలీసులు 10టీంలుగా విడిపోయి గాలింపు చర్యలు చేపట్టారు.