ఢిల్లీలో కమ్ముకున్న దట్టమైన పొగమంచు : విమానాలు, రైళ్లు ఆలస్యం

ఢిల్లీ నగరాన్నిదట్టమైన పొగ మంచు కప్పేసింది. బుధవారం తెల్లవారు ఝూమున 7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఢిల్లీ విమానాశ్రయంలో కమ్ముకున్న దట్టమైన పొగమంచు కారణంగా 200 మీటర్ల దూరంలో ఉన్న వాహనాలు కూడా కనపపడలేదు. పొగ మంచు కారణంగా రన్ వే కనిపించకపోవటంతో 5 విమానాలను దారి మళ్లించారు. మరో 8 విమానాల రాకపోకల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది.
పొగమంచు కారణంగా ఢిల్లీ నుంచి బయలుదేరాల్సిన 22 రైళ్ళు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. ఉదయం 11 గంటల తర్వాత పరిస్ధితి కాస్త మెరుగు పడవచ్చని భారత వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం ఢిల్లీలో మేఘాలు కమ్ముకున్నాయి.
నగరంలో కనిష్టంగా 9.2 డిగ్రీల సెల్సియస్ ఉత్ణాగ్ర్రత నమోదయ్యంది. బుధవారం శీతల గాలులు వీచే అవకాశం ఉందని.. వీటి ప్రభావం వల్ల రాగల రెండు మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు ఇంకా తగ్గుతాయని తెలిపింది. ఢిల్లీలో వాయు కాలుష్యం సోమవారం సాయంత్రం 269గా నమోదు కాగా, మంగళవారం సాయంత్రం ఇది 364 వద్ద ఉంది.