Madhya Pradesh: ఐఎంఏ వార్షిక సమావేశంలో కొట్టుకున్న డాక్టర్లు
రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్కే పాఠక్ మాట్లాడుతూ ‘‘ఇది చాలా బాధాకరమైన సంఘటన. భవిష్యత్తులో ఇది పునరావృతం కాకూడదు. వాగ్వాదం తర్వాత ఐఎంఏ సభ్యులంతా ఒక చోట కూర్చొని ఏదైనా పొరపాటు జరిగితే క్షమించని చర్చించుకున్నారు. దీనిపై కమిటీ వేసి విచారణ జరిపిస్తాం’’ అని అన్నారు.

Doctors Clash With Each Other During IMA Annual Meeting
Madhya Pradesh: జబల్పూర్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వార్షి సమావేశం నడుస్తోంది. సమావేశానికి హాజరైన డాక్టర్లను ఉద్దేశించి ఒక వక్త ప్రసంగిస్తున్నారు. ఇంతలో ఒక వ్యక్తి వక్తపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోడియం వద్దకు వెళ్లారు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. చూస్తుండగానే కొంత మంది డాక్టర్లు పోడియం వద్దకు వెళ్లారు. ఒక్కసారిగా ఒకరికొకరు దాడి చేసుకోవడం ప్రారంభించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్పూర్లో ఆదివారం జరిగింది ఈ ఘటన.
ఈ విషయమై నూతనంగా ఎన్నికైన జబల్పూర్ ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ అభిజిత్ బిష్ణోయి స్పందిస్తూ.. జబల్పూర్ ఐఎంఏ మాజీ అధ్యక్షుడు డాక్టర్ అమరేంద్ర పాండే ప్రారంభోపన్యాసం చేస్తుండగా గ్వాలియర్‌కు చెందిన డాక్టర్లు అభ్యంతరం చెబుతూ ఆయనపై దాడి చేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్కే పాఠక్ మాట్లాడుతూ ‘‘ఇది చాలా బాధాకరమైన సంఘటన. భవిష్యత్తులో ఇది పునరావృతం కాకూడదు. వాగ్వాదం తర్వాత ఐఎంఏ సభ్యులంతా ఒక చోట కూర్చొని ఏదైనా పొరపాటు జరిగితే క్షమించని చర్చించుకున్నారు. దీనిపై కమిటీ వేసి విచారణ జరిపిస్తాం’’ అని అన్నారు.
ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. డాక్టర్లు వార్షిక సమావేశంలో ఇలా ప్రవర్తించడంపై విమర్శలు వస్తున్నాయి.
मध्यप्रदेश: जबलपुर इंडियन मेडिकल एसोसिएशन डॉक्टरों की बैठक में जमकर हुई आपस में मारपीट, वीडियो वायरल …#Madhyapradesh #Jabalpur #IMA #ViralVideos pic.twitter.com/9w2ULWKHsK
— humsamvet (@humsamvet) October 31, 2022