జమ్ముకాశ్మీర్ లో ఎన్ కౌంటర్…నలుగురు ఉగ్రవాదులను హతమార్చిన భద్రతాదళాలు

Jammu and Kashmir Encounter : జమ్ముకాశ్మీర్ లోని ఎన్ కౌంటర్ జరిగింది. గురువారం (నవంబర్ 19,2020) తెల్లవారుజామున బాన్ టోల్ ప్లాజా దగ్గర భద్రతాదళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. భద్రతాదళాలు నలుగురు ఉగ్రవాదులను హతమార్చాయి.
భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారి మూసివేశారు. నగ్రోటా చెక్ పోస్టు ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
https://10tv.in/vedanta-puts-in-expression-of-interest-to-buy-govts-entire-stake-in-bpcl/
పుల్వామా జిల్లాలోని చౌక్ కాకాపోలా ప్రాంతంలో సీఆర్పీఎఫ్ జవాన్లను లక్ష్యంగా చేసుకుని బుధవారం సాయంత్రం ఉగ్రవాదులు గ్రనేడ్ విసిరారు. రద్దీగా ఉండే రహదారిపై గ్రనేడ్ విసరడంతో 12 మంది పౌరులకు గాయాలయ్యాయి. జవాన్లకు ఎలాంటి ప్రమాదం జరగలేదు.