భక్తులారా మీరు ముస్లింలను వ్యతిరేకిస్తున్నారు.. కానీ, మీ జాతిపిత మాత్రం.. అంటూ పోస్టు పెట్టారు.
భారత ప్రధాని నరేంద్ర మోడీ అరబ్ తలపాగా కట్టుకున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి చక్కర్లు కొడుతుంది. ఇటీవల సౌదీ అరేబియాలో పర్యటించిన మోడీ అక్కడి సంప్రదాయ దుస్తుల్లోకి మారిపోయాడని అతని అనుచరులను టార్గెట్ చేస్తూ ఓ వ్యక్తి ఫొటోను పోస్టు చేశాడు. ఐటీ & సోషల్ మీడియా సెల్ కాంగ్రెస్ అనే పేరుతో ఉన్న పేజి ఫొటోను షేర్ చేస్తూ భక్త్ అనే పదం వాడింది.
భక్తులారా మీరు ముస్లింలను వ్యతిరేకిస్తున్నారు.. కానీ, మీ జాతిపిత మాత్రం.. అంటూ పోస్టు పెట్టారు. అదే ఫొటోను మై ఫెల్లో ఇండియన్స్ అనే వ్యక్తి హిందీ నుంచి ఇంగ్లీషులోకి ట్రాన్స్ లేట్ చేసి ‘డబ్బే దేవుడు కాదు. కానీ, దేవుడికి ఏ మాత్రం తక్కువ కాదు. ప్రత్యేకంగా నువ్వు అడుక్కునేవాడిగా మారినప్పుడు. హిందూ హృదయ్ సామ్రాట్ మోడీ తలపాగా ధరించి తాను నాశనం చేసిన ఆర్థిక వ్యవస్థను మెరుగు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. భక్తులారా మనస్సులో పెట్టుకోకండి’ అని ట్వీట్ చేశాడు.
క్షణాల్లో వైరల్ గా మారి రచ్చ లేపుతుండటంతో ఇంగ్లీష్ మీడియా నిజం తెలుసుకునే పనిలో పడింది. రియాద్ గవర్నర్ తో కలిసి నడుస్తున్న ఫొటోను, ప్రిన్స్ ఫైసల్ బిన్ బందార్ అల్ సౌద్ తో కలిసి నడుస్తున్న ఒరిజినల్ ఫొటోలను బయటపెట్టింది. 2019 అక్టోబరు 29న అధికారికంగా రవీశ్ కుమార్ చేసిన పోస్టులో ఈ ఫొటోలు ఉన్నాయి.
Paisa bhagwan nahi hota, lekin Ya Khuda, bhagwan se kam bhi nahi hota, (specially jab aap bhikari ban chuke ho)-
Hindu Hriday Samrat @narendramodi dressing up to get investment in an economy destroyed by him. (Bhakton, dont mind) pic.twitter.com/HyXrMgxIXe
— My Fellow Indians (@MyFellowIndians) October 30, 2019
Hello Riyadh!
PM @narendramodi extended a ceremonial welcome on arrival & greeted by the Governor of Riyadh HRH Prince Faisal bin Bandar Al Saud on his one-day trip to Saudi Arabia. Both countries have entered an exciting phase of expanding the historical India-Saudi ties. pic.twitter.com/1flwFfqePK
— Raveesh Kumar (@MEAIndia) October 28, 2019