Omicron : భారత్‌లో ఒమిక్రాన్ కలకలం.. 87కి పెరిగిన కొత్త వేరియంట్ కేసులు

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలకు వణుకు పుట్టిస్తోంది. గతంలో బయటపడ్డ డెల్టా వేరియంట్‌ కంటే వేగంగా వ్యాపిస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

Omicron : భారత్‌లో ఒమిక్రాన్ కలకలం.. 87కి పెరిగిన కొత్త వేరియంట్ కేసులు

Omicron Cases In India

Updated On : December 16, 2021 / 10:54 PM IST

Omicron : కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలకు వణుకు పుట్టిస్తోంది. గతంలో బయటపడ్డ డెల్టా వేరియంట్‌ కంటే వేగంగా వ్యాపిస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటికే అనేక దేశాలకు పాకింది. మన దేశంలోనూ చాపకింద నీరులా వేగంగా విస్తరిస్తోంది. దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. భారత్ లో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 87కి పెరగడం ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా ఈ ఒక్కరోజే కర్నాటకలో 5, తెలంగాణలో 4 కొత్త ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మొత్తంగా కర్నాటకలో 8, తెలంగాణలో 7, ఢిల్లీలో 10, మహారాష్ట్రలో 32, రాజస్తాన్‌ లో 17, కేరళలో 5, గుజరాత్‌ లో 5, ఏపీ, తమిళనాడు, బెంగాల్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో ఒక్కొక్క ఒమిక్రాన్ కేసు నమోదైంది.

WhatsApp Group Admins : వాట్సాప్ గ్రూపు అడ్మిన్లకు న్యూ పవర్..? అందరి మెసేజ్‌లు డిలీట్ చేయొచ్చు!

ప్ర‌పంచ దేశాల్లో ఒమిక్రాన్ కేసులు భారీ సంఖ్య‌లో న‌మోద‌వుతున్నాయి. ముఖ్యంగా బ్రిట‌న్‌లో ఒమిక్రాన్ విల‌య‌తాండవం చేస్తోంది. రెండు రోజుల వ్య‌వ‌ధిలోనే ఒమిక్రాన్ కేసులు రెట్టింప‌య్యాయి. లండ‌న్, మాంచెస్ట‌ర్ లో పెద్ద సంఖ్య‌లో కేసులు న‌మోద‌వుతున్నాయి. యూర‌ప్‌లోని ఇత‌ర దేశాల్లో సైతం క‌రోనా వ‌ణుకు పుట్టిస్తోంది. ప్ర‌పంచం మొత్తం మీద ఇప్ప‌టివ‌ర‌కు 22వేల‌కు పైగా ఒమిక్రాన్ కేసులు న‌మోదైన‌ట్టు స‌మాచారం. మొత్తం 77 దేశాలకు ఒమిక్రాన్ పాకింది.

Omicron Variant vs Delta: డెల్టా కంటే ఒమిక్రాన్ ప్రమాదమా? రెండు వేరియంట్లలో ఏయే లక్షణాలు ఉన్నాయంటే..?

కరోనా మహమ్మారి కొత్త రూపు సంతరించుకుని ఒమిక్రాన్ వేరియంట్ గా రూపాంతరం చెందింది. ఒమిక్రాన్ లో దాదాపు 32 జన్యు ఉత్పరివర్తనాలు గుర్తించారు. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఈ కొత్త వేరియంట్ చూస్తుండగానే అనేక దేశాలకు పాకిపోయింది. రోజుల వ్యవధిలోనే 70కి పైగా దేశాలకు వ్యాపించింది.

కరోనా మహమ్మారి ముప్పు మానవాళిని ఇప్పుడప్పుడే వదిలేలా లేదు. రూపం మార్చుకున్న కొవిడ్ రాకాసి.. ఒమిక్రాన్ వేరియంట్‌ రూపంలో విరుచుకుపడుతోంది. ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రపంచాన్ని వేగంగా చుట్టేస్తోంది. మన దేశంలోనూ ఒమిక్రాన్ కలవరం మొదలైంది. ఆ రాష్ట్రం.. ఈ రాష్ట్రం అని లేదు.. దేశమంతా కొత్త కేసులు నమోదవుతున్నాయి.