Assam : ఆ స్కూల్లో ఫీజుకి బదులు.. అవి తీసుకు రావాలి.. లేదంటే..

ఆ స్కూల్లో ఫీజు కింద డబ్బులు కట్టించుకోరు కానీ .. అవి చెల్లించాలి.. ఏంటవి? చదవండి మరి.

Assam : ఆ స్కూల్లో ఫీజుకి బదులు.. అవి తీసుకు రావాలి.. లేదంటే..

Assam

Updated On : October 15, 2023 / 4:08 PM IST

Assam : ప్లాస్టిక్ బాటిళ్లను స్కూలు ఫీజుగా తీసుకుంటున్న అసోంలోని ఓ స్కూలు వీడియోను నాగాలాండ్ మినిస్టర్ టెమ్‌జెన్ ఇమ్నా అలోంగ్ ట్విట్టర్‌లో షేర్ చేసారు. ఈ వీడియో ఆశ్చర్యపరచడమే కాదు.. ఆలోచింపజేస్తోంది.

Tanya Appachu Kaul : ఈ కారణాలతో కూడా విడాకులు తీసుకుంటారా..? ఓ లాయర్ పోస్ట్ వైరల్

సముద్రం నుండి పర్వతాల వరకూ ఎటు చూసినా ప్లాస్టిక్ నిండిపోతోంది. రెండు దశాబ్దాల క్రితం కంటే కూడా రెండు రెట్లు ప్లాస్టిక్ వినియోగం ఎక్కువ అయ్యింది. దీనిలో కొంత శాతం మాత్రం విజయవంతంగా రీసైకిల్ చేయబడుతోంది. అసోంలోని ఓ స్కూల్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఈ స్కూల్ ప్రత్యేకమైన ప్లాస్టిక్ రీ సైక్లింగ్ పద్ధతిలో ముందుకు సాగుతోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నాగాలాండ్ మినిస్టర్ టెమ్‌జెన్ ఇమ్నా ప్లాస్టిక్‌ను మాత్రమే స్కూలు ఫీజుగా తీసుకుంటున్న అసోంలోని అక్షర ఫౌండేషన్ క్లిప్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఈ స్కూల్లో ఫీజు క్రింద విద్యార్ధులు వారానికి 25 బాటిళ్లు తీసుకుని రావాలి.

‘ఇది మీకు ఆశ్చర్యం కాకపోతే మరేంటి?’ అనే శీర్షికతో టెమ్‌జెన్ ఇమ్నా వీడియోను షేర్ చేసారు. 2016 లో షర్మిత శర్మ, మాజిన్ ముఖ్తార్ అనే ఇద్దరు అసోంలో ఈ పాఠశాలను స్ధాపించారట. చెత్త, నిరక్షరాస్యత ఈ రెండు సమస్యల పరిష్కారం కోసం వారు ప్రతి వారం విద్యార్ధుల నుంచి ప్లాస్టిక్ బాటిళ్లను సేకరించేలా నిర్ణయించారు. ఇక్కడ పిల్లలకు ఉచిత విద్యను అందిస్తూ స్కూల్ నడుపుతున్నారు. సేకరించిన ప్లాస్టిక్ బాటిళ్లను ఇటుకలు, రోడ్లు, మరుగుదొడ్ల నిర్మాణంలో వినియోగిస్తారట.

Viral Video : గాజులు తొడిగి.. పూలు జల్లి కుక్కకు శ్రీమంతం.. వైరల్ అవుతున్న వీడియో

ఈ స్కూల్‌లో రెగ్యులర్ సబ్జెక్ట్స్‌తో పాటు పలు భాషలు, ప్లాస్టిక్ రీసైక్లింగ్, వడ్రంగి, తోటపని మొదలైనవి భోదిస్తారు. గతంలోనే ఈ స్కూల్ వార్తల్లోకి వచ్చినా తాజాగా టెమ్‌జెన్ ఈ స్కూల్ వీడియో షేర్ చేయడంతో మరోసారి హైలైట్ అయ్యింది.