చైనా తరహాలోనే పూర్తి లాక్‌డౌన్‌కు భారత్ సిద్ధమవుతోందా?

చైనాలో కరోనా ఎటునుంచి ఎటు వెళ్తుందో అర్థం కాలేదు. రోజుల వ్యవధిలో పదుల సంఖ్యలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులతో ప్రభుత్వం షాక్ అయింది. ప్రజలకు ట్రీట్‌మెంట్ ఇవ్వాలంటే వైరస్ ను గుర్తించాలి. ఒక్క చోటుకే కేంద్రీకరించాలి. అప్పుడే సాధ్యమవుతుందని భావించి లాక్ డౌన్ ప్రకటించింది. వూహాన్‌ను దిగ్భందం చేసింది.
ప్రధాని నరేంద్ర మోడీ.. దేశవ్యాప్తంగా ఆదివారం జనతా కర్ఫ్యూ చేయాలని పిలుపునిచ్చారు. కరోనాను అరికట్టేందుకు భారత్ తీసుకుంటున్న తొలి అడుగు ఇది. మున్ముందు దేశ వ్యాప్తంగా నగరాల్లో, పట్టణాల్లో మరిన్ని చర్యలు తీసుకోనున్నారు. అత్యవసరం కాని ప్రయాణాలను ప్రజలు పూర్తిగా మానేసేపరిస్థితి. దేశంలోని పరిస్థితులు చూస్తుంటే రాష్ట్రాలు ఒక్కొక్కటిగా మొదలై దేశమంతా లాక్ డౌన్ అయ్యే అవకాశాలు లేకపోలేదు.
విదేశీయులు భారత్‌లో పర్యటిస్తున్న సందర్భంలో వారికి కరోనా వచ్చిన కేసులు ఉన్నాయి. ఎన్నారైలు భారత్‌కు వచ్చిన తర్వాత కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు కరోనా తీవ్రత పెరిగి ఒకరి నుంచి మరొకరికి పాకుతుంది. భారత్‌లో పరిస్థితి ఊహించిన దాని కంటే ప్రమాదకరంగా మారుతుంది. ఈ క్రమంలోనే రాష్ట్రాలు ముందుజాగ్రత్తతో ఒక్కొక్కటిగా లాక్ డౌన్ ప్రకటిస్తున్నాయి.
ఇదిలా ఉంటే ఒడిశా.. వారం రోజుల పాటు షట్ డౌన్ ప్రకటించనుంది. ‘మేం ప్రస్తుతం లాక్ డౌన్ ప్రకటించడం లేదు. కాకపోతే భవిష్యత్‌లో చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మీ భద్రత కోసం అవసరమైతే తప్పనిసరిగా లాక్ డౌన్ చేస్తాం’ అని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ శనివారం వెల్లడించారు. 5 జిల్లాలు, 8 పట్టణాలను ఆదివారం నుంచి వారం రోజుల పాటు లాక్ డౌన్ చేస్తున్నట్లు తెలిపారు.
ఇండియన్ రైల్వేస్‌లోనూ అదే పరిస్థితి.. కొద్ది పాజిటివ్ కేసులు నమోదవడం అది కూడా రైలులో ప్రయాణిస్తుండగానే అంటుకున్నాయని తెలియడంతో ప్రయాణాల్లోనూ అదే భయం. శుక్రవారం సంచలన నిర్ణయం తీసుకుంది ఇండియన్ రైల్వే. జనతా కర్ఫ్యూలో భాగంగా శనివారం మార్చి 21 రాత్రి10 గంటలనుంచి, 22వ తేదీ ఆదివారం అర్ధరాత్రి12 గంటల వరకూల బయలు దేరే రైలు సర్వీసులను రద్దు చేయాలని నిర్ణయించారు.
ప్రధాని మోడీ మార్చి 22 ఆదివారం ఉదయం 7గంటల నుంచి రాత్రి 9గంటల వరకూ జనతా కర్ఫ్యూలో పాల్గొనాలని.. అదే సమయంలో ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రాకూడదని సూచించారు.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా పేట్రేగిపోతుంది. శుక్రవారం నాటికి 627కేసులు నమోదుకాగా, 11వేల 868మందిని పరిశీలనలో ఉంచారు. మొత్తం 2లక్షల 84వేల మంది ఇన్ఫెక్షన్‌కు గురయ్యారు. మరో అద్భుతమేమంటే చైనాలో శుక్రవారం ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఇప్పటివరకూ ఇటలీలో 4వేల 32మంది, చైనాలో 3వేల 139మంది, ఇరాన్‌లో వెయ్యి 433మంది, స్పెయిన్‌లో వెయ్యి 93మంది ప్రాణాలు కోల్పోయారు.