Express Trains Speed Increased : ఎక్స్‌ప్రెస్ రైళ్ల వేగం పెంపు.. రెండు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు
దేశంలో ఎక్స్‌ప్రెస్ రైళ్ల వేగం పెరిగింది. రైల్వే కొత్త టైంటేబుల్ ప్రకారం 500 ఎక్స్‌ప్రెస్ రైళ్ల వేగం పెరిగింది. 130 రైళ్లను సూపర్‌ఫాస్ట్ క్యాటగిరీలో చేర్చినట్టు రైల్వే మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది.

express trains speed
Express Trains Speed Increased : దేశంలో ఎక్స్‌ప్రెస్ రైళ్ల వేగం పెరిగింది. రైల్వే కొత్త టైంటేబుల్ ప్రకారం 500 ఎక్స్‌ప్రెస్ రైళ్ల వేగం పెరిగింది. 130 రైళ్లను సూపర్‌ఫాస్ట్ క్యాటగిరీలో చేర్చినట్టు రైల్వే మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది. మొత్తంగా అన్ని రైళ్ల వేగాన్ని 5శాతం పెంచడంతో మిగతా రైళ్ల నిర్వహణకు 5శాతం అదనపు మార్గం లభించిందని తెలిపింది.
ఇండియన్ రైల్వే కొత్త టైం టేబుల్ అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చినట్టు పేర్కొంది. న్యూఢిల్లీ-వారణాసి, న్యూఢిల్లీ-కాట్రా మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం రైళ్లను ప్రవేశపెడుతున్నట్టు టైం టేబుల్‌లో వెల్లడించింది. గాంధీనగర్-ముంబై మధ్య మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును కూడా ప్రవేశపెట్టినట్టు తెలిపింది.