కొవిడ్ లాక్‌డౌన్ తర్వాత ఇస్రో తొలి లాంచింగ్

ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ EOS-01తో పాటు 9 ఇంటర్నేషనల్ శాటిలైట్స్ లాంచింగ్‌కు కౌంట్ డౌన్ మొదలైంది. వాహక నౌక కౌంట్‌డౌన్ శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటా రెండు నిమిషాలకు ప్రారంభమైంది. నిరంతరాయంగా 26గంటల పాటు కొనసాగనుంది. శనివారం మధ్యాహ్నం 3గంటల 2 నిమిషాలకు సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి రాకెట్‌ను సైంటిస్టులు నింగిలోకి పంపనున్నారు.
పీఎస్‌ఎల్‌వీ ఇండియాకు చెందిన ఈవోఎస్-1తోపాటు, విదేశాలకు చెందిన 9 శాటిలైట్లను నిర్ణీత కక్ష్యలోకి మోసుకెళ్లనుంది. దేశానికి చెందిన భూ పరిశీలన ఉపగ్రహం ద్వారా వాతావరణ, వ్యవసాయ, అటవీ సంబంధ సమాచారం తెలుసుకోవచ్చు. వాహకనౌకకు రూ.175 కోట్లు, ఉపగ్రహానికి రూ. 125 కోట్ల వరకు వ్యయం చేశారు.
EOS-01 శాటిలైట్ ప్రధాన ఉద్దేశ్యం.. వ్యవసాయం, అటవీ సంపద, ప్రమాద విపత్తుల సమన్వయ సహకారం గురించి తెలుసుకోవడానికేనని ఇస్రో చెప్పింది. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎస్ఐఎల్) డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ తో కస్టమర్ శాటిలైట్స్ కమర్షియల్ అగ్రిమెంట్ కుదుర్చుకుని లాంచింగ్ మొదలుపెట్టనున్నారు.
https://10tv.in/us-court-orders-isros-antrix-to-pay-1-2-bn-to-devas-as-compensation/
టెక్నాలజీ డిమాన్‌స్ట్రేషన్ కోసం లిథువానియాతో పాటు లూక్సెమ్‌బర్గ్, యూఎస్ఏకు చెందిన శాటిలైట్లను మ్యారీ టైం అప్లికేషన్లు, మల్టీ మిషన్ రిమోట్ సెన్సింగ్ కోసం లాంచ్ చేయాలనేదే ప్లాన్.