Gayatri Mantra : క్లిష్టమైన సర్జరీ జరుగుతుండగా గాయత్రి మంత్రం జపించిన పేషెంట్

జైపూర్‌లోని నారాయ‌ణ హాస్పిట‌ల్‌లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. సంక్లిష్టమైన బ్రెయిన్ ట్యూమ‌ర్ స‌ర్జ‌రీ జరుగుతుండగా పేషెంట్ గాయంత్రి మంత్రం జపించాడు. ఈ కీల‌క స‌ర్జ‌రీ నిర్వహించి బ్రెయిన్ ట్యూమ‌ర్‌ను తొల‌గించే వ‌ర‌కూ అతడు స్పృహ‌లోనే ఉన్నాడు. త‌న‌కిష్ట‌మైన గాయత్రి మంత్రం జపించాడు. నాలుగు గంటల పాటు ఈ సర్జరీ నిర్వహించారు.

Gayatri Mantra : క్లిష్టమైన సర్జరీ జరుగుతుండగా గాయత్రి మంత్రం జపించిన పేషెంట్

Gayatri Mantra

Updated On : August 10, 2021 / 5:46 PM IST

Gayatri Mantra : జైపూర్‌లోని నారాయ‌ణ హాస్పిట‌ల్‌లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. సంక్లిష్టమైన బ్రెయిన్ ట్యూమ‌ర్ స‌ర్జ‌రీ జరుగుతుండగా పేషెంట్ గాయంత్రి మంత్రం జపించాడు. ఈ కీల‌క స‌ర్జ‌రీ నిర్వహించి బ్రెయిన్ ట్యూమ‌ర్‌ను తొల‌గించే వ‌ర‌కూ అతడు స్పృహ‌లోనే ఉన్నాడు. త‌న‌కిష్ట‌మైన గాయత్రి మంత్రం జపించాడు. నాలుగు గంటల పాటు ఈ సర్జరీ నిర్వహించారు. అంతసేపూ రోగి మెలకువలోనే ఉన్నాడు. గాయత్రి మంత్రం జపించాడు.

బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ సంక్లిష్టమైన శస్త్ర చికిత్స. ఎంతో జాగ్రత్తగా చేయాలి. ఏ మాత్రం తేడా వచ్చినా రోగి ప్రాణాలకే ప్రమాదం. అలాంటిది రోగి స్పృహలో ఉండగానే సీనియ‌ర్ న్యూరోస‌ర్జ‌న్ డాక్ట‌ర్ కేకే బ‌న్స‌ల్ నేతృత్వంలో న్యూరో స‌ర్జ‌రీ టీం విజ‌య‌వంతంగా ఈ ఆప‌రేష‌న్ నిర్వ‌హించింది. చురు ప్రాంతానికి చెందిన రిటైర్డ్ ఆర్మీ హ‌వ‌ల్ధార్ రిధ్మ‌ల్ రామ్ (57) మాట్లాడ‌లేక పోతున్నాడు. అతడిని టెస్ట్ చేసిన డాక్టర్లు బ్రెయిన్‌లోని స్పీచ్ ఏరియాలో లోగ్రేడ్ బ్రెయిన్ ట్యూమ‌ర్‌ను గుర్తించారు.

అది సున్నిత‌మైన ప్రాంతం. అక్కడ ట్యూమ‌ర్‌ను తొల‌గించే క్ర‌మంలో మాట్లాడే శ‌క్తి కోల్పోవ‌డంతో పాటు ప‌క్ష‌వాతం వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాగా, సర్జరీని సీనియ‌ర్ న్యూరోస‌ర్జ‌న్ డాక్ట‌ర్ కేకే బ‌న్స‌ల్ నేతృత్వంలోని న్యూరో స‌ర్జ‌న్ల బృందం విజ‌య‌వంతంగా ఎవేక్ బ్రెయిన్ న్యూరో స‌ర్జ‌రీని నిర్వ‌హించింద‌ని నారాయ‌ణ హాస్పిట‌ల్ క్లినిక‌ల్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ మాలా ఐరున్ తెలిపారు. ఇక సర్జరీ ముగిసేవ‌ర‌కూ రోగి స్పృహలోనే ఉన్నారని, గాయ‌త్రి మంత్రం జ‌పించాడని చెప్పారు.

పేషెంట్ స్పృహలోనే ఉండగానే నిర్వహించే సర్జరీని ‘ఎవేక్ బ్రెయిన్ న్యూరో సర్జరీ’గా పిలుస్తారని డాక్టర్లు చెప్పారు. ఇలాంటి ఆపరేషన్ సమయంలో పేషెంట్ తప్పుకుండా మెలకువలో ఉండాలి. అప్రమత్తంగా ఉండటం ఎంతైనా అవసరం. అలాంటి పరిస్థితుల్లో సర్జరీ చేస్తే మెదడులోని కీలక భాగాలకు ఎటువంటి డ్యామేజ్ జరగకుండా ఉంటుందని డాక్టర్లు వివరించారు.

గతంలో లండన్ లోనూ ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది. 53ఏళ్ల వ్యక్తికి కింగ్స్ కాలేజీ ఆస్పత్రిలో డాక్టర్లు మెదడుకు శస్త్ర నిర్వహించారు. మెదడులో కణతిని తొలగించేందుకు సర్జరీ నిర్వహించగా… ఆ సమయంలో సదరు పేషెంట్ వయోలిన్ వాయించడం గమనార్హం. తద్వారా ఆ సమయంలో మెదడు మరింత చురుగ్గా ఉంటుందని… ఆపరేషన్‌కు అది దోహదపడుతుందని డాక్టర్లు తెలిపారు.

ఇక గుంటూరు డాక్టర్లు రోగికి బిగ్‌బాస్ షో చూపిస్తూ సర్జరీ చేశారు. అత్యాధునిక న్యూరో నావిగేషన్‌ వైద్య విధానంలో విజయవంతంగా సర్జరీ పూర్తి చేసి రోగి ప్రాణాలు కాపాడారు. ఏపీలో తొలి అవేక్ బ్రెయిన్ సర్జరీ ఇదే అని డాక్టర్లు చెప్పారు.