Viral Video: అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని యువకుడిని నడి రోడ్డుపై చెప్పులతో కొట్టిన మహిళలు

ఈ ఘటన కర్ణాటకలోని ధాన్వాడ్ జిల్లాలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను స్థానికులు కెమెరాలో రికార్డు చేసి, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయగా, ఈ వీడియో వైరల్ అవుతోంది. అక్కడి మహిళలు చెప్పిన వివరాల ప్రకారం... నిందితుడు బాగా మద్యం తాగి రోడ్డుపై తూలుతూ నడుస్తున్నాడు. కనపడిన మహిళల ఫోన్ నెంబర్లు అడుగుతూ అసభ్యంగా ప్రవర్తించాడు.

Viral Video: అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని యువకుడిని నడి రోడ్డుపై చెప్పులతో కొట్టిన మహిళలు

Viral Video

Updated On : December 30, 2022 / 5:58 PM IST

Viral Video: పీకలదాకా తాగి నడి రోడ్డుపై మహిళలతో అసభ్యంగా ప్రవర్తించాడు ఓ యువకుడు. దీంతో అతడిని పట్టుకుని మహిళలు చెప్పులతో కొట్టారు. ఈ ఘటన కర్ణాటకలోని ధాన్వాడ్ జిల్లాలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను స్థానికులు కెమెరాలో రికార్డు చేసి, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయగా, ఈ వీడియో వైరల్ అవుతోంది.

అక్కడి మహిళలు చెప్పిన వివరాల ప్రకారం… నిందితుడు బాగా మద్యం తాగి రోడ్డుపై తూలుతూ నడుస్తున్నాడు. కనపడిన మహిళల ఫోన్ నెంబర్లు అడుగుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో స్థానికులు అతడిని పట్టుకుని దేహ శుద్ధి చేశారు. మహిళలు కూడా నాలుగు తగిలించారు. నడిరోడ్డుపైనే కూర్చొని నిందితుడు తన్నులు తిన్నాడు.

అతడిని గట్టిగా బుద్ధి చెప్పిన తర్వాత అతడిని స్థానికులు వదిలేసినట్లు తెలుస్తోంది. రోడ్డుపై అసభ్యంగా ప్రవర్తించే వారికి ఇలాగే బుద్ధి చెప్పాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే నడిరోడ్డుపై బుద్ధి చెబితేనే మరొకరు ఇటువంటి ఘటనకు పాల్పడకుండా భయపడతారని కొందరు పేర్కొన్నారు.

Google Map: గూగుల్ మ్యాప్‌ వల్ల ఇబ్బందిపడ్డా.. ప్రముఖ కమెడియన్ ట్వీట్‌కు గూగుల్ సమాధానం ఏమిటంటే?