భార్య అశ్లీల వీడియోతో విడాకులు గెలిచిన భర్త

భార్య అశ్లీల వీడియోతో విడాకులు గెలిచిన భర్త

Updated On : November 23, 2019 / 9:34 AM IST

విడాకుల కోసం కోర్టు మెట్లెక్కి ఏళ్ల తరబడి తిరుగుతున్న వ్యక్తి ఓ వీడియో సాక్ష్యం ప్రవేశపెట్టి విజయం సాధించాడు. 1991, జులై 7న బళ్లారిలో ఒకటైన జంటకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కొన్ని వారాలుగా భార్య ప్రవర్తనలో మార్పు గమనించిన ఆ వ్యక్తికి 2008 జూన్ 4నుంచి జూన్ 9వరకూ నాలుగు రోజుల పాటు ఊరు వెళ్లాల్సి వచ్చింది. నిజం తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతో ఇంట్లో ఓ వీడియో రికార్డర్‌ను రహస్యంగా ఉంచాడు. 

అందులో ఎవరో వ్యక్తికి తన భార్య సన్నిహితంగా ఉండటమే కాక, శృంగారం జరిపిన ఘటన రికార్డ్ అయింది. దానిని కోర్టులో ప్రవేశపెట్టి తనకు విడాకులు కావాలంటూ కోర్టును అభ్యర్థించాడు. భర్త కేసును ఛాలెంజ్ చేస్తూ 2013 జూలై 30న హైకోర్టులో కేస్ వేసింది. తన భర్త పోర్నగ్రఫీ వీడియోలు తీస్తుంటాడని తెలిపింది. ఈ క్రమంలోనే ఎవరో వ్యక్తితో అలా చేయించి వీడియో రికార్డు చేశాడని వెల్లడించింది. 

అలోక్ అరాధె, పీజీఎం పాటిల్ ల బృందంతో ఓ కమిటీ వేసి విచారణ చేపట్టారు. డీవీడీలో ఉన్న వీడియోను పూర్తిగా పరిశీలించిన న్యాయవాదులు అందులో బలవంతంగా చేసినట్లు ఏమీ కనిపించలేదని, కావాలనే చేసినట్లుగా ఉందని తేల్చేశారు. ఫలితంగా భార్య వేసిన కేసును కోర్టు కొట్టేసింది.

భర్త కేసు విషయంలో వాదనలు విన్న కోర్టు ఆ వీడియో తీసిన సమయంలో వారిద్దరి కూతుళ్లలో ఒకరు ఇంట్లోనే ఉన్న విషయం గుర్తించారు. కూతుర్ని విచారణ జరపడంతో నాన్న లేని సమయంలో ఎవరో వ్యక్తి ఇంటికి వచ్చి వెళ్లేవాడని తెలిపింది. ఆ వీడియోను ప్రధాన సాక్ష్యంగా పరిగణిస్తూ కోర్టు విడాకులు మంజూరు చేసింది. లైంగికంగా ఇష్టమైన వారితో గడిపేందుకు చట్టం ఒప్పుకుంటున్నప్పటికీ భార్యభర్తల్లో ఆ విషయం ఎవరికి నచ్చకపోయినా విడాకులు కోరవచ్చు.