Karnataka Prisoners Salary Hike: కర్ణాటక జైళ్లలో ఖైదీల వేతనాలు 3 రెట్లు పెంచిన ప్రభుత్వం .. ఖైదీల పనే బాగుందంటున్న నెటిజన్లు
జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల వేతనాలు పెంచింది కర్ణాటక ప్రభుత్వం. గతం కంటే ఉన్న రోజు వారీ వేతనాన్ని మూడు రెట్లు పెంచుతున్నట్లు రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Karnataka Prisoners Salary Hike
Karnataka Prisoners Salary Hike: జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల వేతనాలు పెంచింది కర్ణాటక ప్రభుత్వం. గతం కంటే ఉన్న రోజు వారీ వేతనాన్ని మూడు రెట్లు పెంచుతున్నట్లు రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఉచిత భోజనం వసతితో పాటు వేతనాలు పెంచారు జైళ్లలో ఖైదీల పనే బాగుంది అంటున్నారు నెటిజన్లు.
పలు నేరాలు చేసి జైళ్లలో శిక్ష అనుభవించే ఖైదీలు జైళ్లలో రకరకాల పనులు చేస్తుంటారు. ఖైదీలు చేసే పనికి ప్రభుత్వం వేతనం ఇస్తుంటుంది. ఆ వేతనాన్ని లెక్క కట్టి సదరు ఖైదీలు విడుదల అయ్యాక మొత్తం ఇచ్చి విడుదల చేస్తుంది. లేదా ఖైదీల వేతనాలను వారి అనుమతి మేరకు వారి కుటుంబాలకు ఇస్తుంది జైళ్ల శాఖ. ఇదిలా ఉంటే కర్ణాటక ప్రభుత్వం ఇప్పటి వరకు ఖైదీలకు ఇచ్చే వేతనాన్ని మూడు రెట్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే ఖైదీలకు వేతనాలు ఎక్కువ ఇచ్చే రాష్ట్రంగా కర్ణాటక మొదటిస్థానంలో ఉంది.
కాగా..కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 54 జైళ్లు ఉన్నాయి. ఈ జైళ్లలో 3,565 మంది ఖైదీలు శిక్ష అనుభవిస్తున్నారు. వీరందరికీ ప్రభుత్వం ప్రతీ ఏటా చెల్లిస్తున్న వేతనాల మొత్తం రూ.58,28,34,720గా ఉంది. ఇప్పుడీ మొత్తాన్ని మూడు రెట్లు పెంచడంతో దేశంలోని మిగతా జైళ్లతో పోలిస్తే కర్ణాటక జైళ్లలోని ఖైదీలు అత్యధిక వేతనం పొందనున్నారు.
జైలులో శిక్ష అనుభవించే ఖైదీలు వాళ్లు చేసే పనులకు రోజుకు రూ.524 ఇస్తుంది ప్రభుత్వం. రెండో సంవత్సరంలో రోజుకు రూ.548 చొప్పున నెలకు రూ.14,248 చొప్పున ఖైదీలకు అధికారులు చెల్లిస్తారు. దీంట్లో ఖైదీలకు వారంతపు సెలవు కూడా ఉంటుంది. సెలవు రోజున వేతనం ఇవ్వరు. అలాగే మూడో సంవత్సరంలో రోజుకు రూ.615 చొప్పున నెలకు రూ.15,990, నాలుగో సంవత్సం నుంచి రోజుకు రూ.663 చొప్పున నెలకు రూ.17,238 చెల్లిస్తారు. ఇలా ఏడాది ఏడాదికి వారి రోజువారీ వేతనం పెరుగుతుంది. ఈ వేతనాలను లెక్క కట్టి వారి విడుదల అయినప్పుడు మొత్తం వారికి అందజేస్తుంది. లేదా ఖైదీల అనుమతి ప్రకారం మధ్యలో వారి కష్టార్జితాన్ని వారి వారి కుటుంబాలకు కూడా పంపించే ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం.
కాగా..ఖైదీల వేతనాలను పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. బయట కంటే జైళ్లలో ఖైదీల పనే బాగుందిగా వేతనం పెంచుతున్నారు..పైగా ఉచిత భోజనం, వసతి కూడా ఉంటుంది. ఖైదీల పనే బాగుందని కామెంట్లు పెడుతున్నారు.