కేరళలో తొలి కరోనా మరణం

  • Published By: chvmurthy ,Published On : March 28, 2020 / 07:17 AM IST
కేరళలో తొలి కరోనా మరణం

Updated On : March 28, 2020 / 7:17 AM IST

కేరళలో తొలి కరోనా మరణం సంభవించింది.  కరోనా కు చికిత్స పొందుతూ 69 ఏళ్ల వృధ్దుడు మరణించాడు. దేశంలో కరోనా తో మరణించిన రోగుల సంఖ్య 21 కి చేరింది. దేశంలో అత్యధికంగా176 కరోనా  పాజిటివ్ కేసులు కేరళలోనే నమోదయ్యాయి. దేశంలో తొలి  కరోనా పాజిటివ్ కేసు జనవరి 30న నమోదయ్యింది కూడా కేరళలోనే.  

ఆస్పత్రిలో చేరి నెగెటివ్ వచ్చి ఇంటికి డిశ్చార్జ్ అయిన పేషెంట్లు కూడా కేరళలో ఉన్నారు. కానీ..  ఇటీవలే దుబాయ్ నుంచి వచ్చిన ఈ వ్యక్తి మార్చి 22న ఆస్పత్రిలో చేరాడు. 
అదీ కాకఅతనికి  హైబీపీ, షుగర్, గుండె సంబంధింత ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నట్లు  వైద్యులు చెప్పారు.  

రాష్ట్రంలో కరోనా వైరస్ ను ఎదుర్కోటానికి కేంద్ర ప్రభుత్వం తో సంబంధం లేకుండా ప్రత్యేక బడ్జెట్ ను కేటాయించారు.  కేరళలో కరోనా బాధితులను గుర్తించి వారిని ఆస్పత్రులకు తీసుకురాకుండా వారి ఇళ్లలోనే క్వారంటైన్ చేసి  వైద్యులనే  వారి వద్దకు పంపి కేరళ ప్రభుత్వం వైద్యం అందిస్తోంది.