Congress President Election: కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఖర్గేనే సరియైన వ్యక్తి.. శశిథరూర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన గెహ్లాట్

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నికల్లో ఖర్గేనే విజయం సాధిస్తారని గెహ్లాట్ అన్నారు. ఖర్గేకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని, ఆయన దళిత వర్గం నుంచి వచ్చిన ఓ సహృదయ నేత అన్నారు. ఖర్గే అధ్యక్ష స్థానానికి పోటీ చేయడాన్ని అందరూ స్వాగతిస్తున్నారని గెహ్లాట్ వ్యాఖ్యానించారు.

Congress President Election: కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఖర్గేనే సరియైన వ్యక్తి.. శశిథరూర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన గెహ్లాట్

congress president

Updated On : October 2, 2022 / 1:30 PM IST

Congress President Election: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి రేసులో ఆ పార్టీ సీనియర్ నేతలు మల్లిఖార్జున్ ఖార్గే, శశిథరూర్‌లు ఉన్నారు. వీరిలో ఎవరినో ఒకరిని ఓటింగ్ ద్వారా కాంగ్రెస్ కమిటీ సభ్యులు ఎన్నుకుంటారు. ఈ నెల 8న నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉండగా, 17న పోలింగ్ జరగనుంది. పార్టీ అధ్యక్ష బరిలో నిలిచిన ఖర్గే, శశిథరూర్ గురించి రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Rajasthan Crisis: కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అమిత్ షాతో భేటీ అయ్యారు.. రాజస్థాన్ సీఎం గెహ్లాట్ సంచలన వ్యాఖ్యలు..

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నికల్లో ఖర్గేనే విజయం సాధిస్తారని గెహ్లాట్ అన్నారు. ఖర్గేకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని, ఆయన దళిత వర్గం నుంచి వచ్చిన ఓ సహృదయ నేత అన్నారు. ఖర్గే అధ్యక్ష స్థానానికి పోటీ చేయడాన్ని అందరూ స్వాగతిస్తున్నారని గెహ్లాట్ వ్యాఖ్యానించారు. పార్టీని క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం చేయడానికి కావాల్సిన అనుభవం ఖర్గేకు ఉందని, ఆ విషయంలో థరూర్ ను ఖర్గేతో పోల్చలేమని, సహజంగానే కాంగ్రెస్ లోని అధికశాతం మంది ఖర్గే వైపే ఉంటారని గెహ్లాట్ వ్యాఖ్యానించారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

శశిథరూర్ గురించి గెహ్లాట్ మాట్లాడుతూ.. శశిథరూర్ మంచి వ్యక్తే అని, ఆయనకూ ఉన్నతమైన ఆలోచనలు ఉన్నాయని అన్నారు. కానీ, ఆయన ఉన్నత వర్గానికి చెందిన వ్యక్తి అంటూ గెహ్లాట్ అన్నారు. థరూర్ ను ఖర్గేతో ఏ విషయంలోనూ పోల్చలేమని, అందువల్ల సహజంగానే ఖర్గే వైపు ఏకపక్షంగా ఎన్నిక జరుగుతుందని గెహ్లాట్ అన్నారు.