ICMR Lockdown : తొందర వద్దు.. లాక్‌డౌన్ తొలగింపులపై ఐసీఎంఆర్ కీలక వ్యాఖ్యలు

దేశంలో కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టింది. కరోనా కొత్త కేసులు తగ్గాయి. ఈ క్రమంలో కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు లాక్ డౌన్ తొలగింపులపై ఫోకస్ పెట్టాయి. లాక్ డౌన్ ఆంక్షలు ఎత్తివేయాలని భావిస్తున్నాయి. దీనిపై ఐసీఎంఆర్ స్పందించింది. లాక్ డౌన్ ఎత్తివేతపై తొందరపడొద్దని సూచించింది.

ICMR Lockdown : తొందర వద్దు.. లాక్‌డౌన్ తొలగింపులపై ఐసీఎంఆర్ కీలక వ్యాఖ్యలు

Lockdown Should Be Lifted Gradually And Slowly Icmr

Updated On : June 3, 2021 / 7:06 AM IST

ICMR Lockdown : సెకండ్ వేవ్ లో విలయతాండవం చేస్తున్న కరోనా మహమ్మారి కట్టడి కోసం ప్రభుత్వాలు లాక్ డౌన్లు, కర్ఫ్యూలు వంటి ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ నిబంధనలను ఆయా ప్రభుత్వాలు కఠినంగా అమలు చేస్తున్నాయి. ఈ ఆంక్షలు ఫలితాలు ఇస్తున్నాయి. దేశంలో కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టింది. కరోనా కొత్త కేసులు తగ్గాయి. ఈ క్రమంలో కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు లాక్ డౌన్ తొలగింపులపై ఫోకస్ పెట్టాయి. లాక్ డౌన్ ఆంక్షలు ఎత్తివేయాలని భావిస్తున్నాయి. దీనిపై ఐసీఎంఆర్ స్పందించింది. లాక్ డౌన్ ఎత్తివేతపై తొందరపడొద్దని సూచించింది.

లాక్‌డౌన్ల ఎత్తివేత ప్రక్రియను అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని ఐసీఎంఆర్‌ సూచించింది. కరోనా థర్డ్‌ వేవ్‌ను దృష్టిలో ఉంచుకొని వ్యూహాత్మకంగా వ్యవహరించాలని ఐసీఎంఆర్‌ చీఫ్‌ బలరామ్‌ భార్గవ తెలిపారు. ఇందుకోసం ఆయన మూడు అంశాల ప్రణాళికను సూచించారు. తక్కువ పాజిటివిటీ రేటు, అత్యధిక మందికి టీకాలు, కొవిడ్‌ నిబంధనలతో కూడిన ప్రవర్తన వంటి అంశాలను రాష్ట్రాలు పరిగణనలోకి తీసుకొని లాక్‌డౌన్ల సడలింపులపై నిర్ణయం తీసుకోవాలన్నారు.

ప్రతివారం పాజిటివిటీ రేటు 5శాతం కంటే తక్కువగా ఉండి.. కొవిడ్‌ ముప్పు అధికంగా ఉన్నవర్గాలకు 70శాతం టీకాలు వేసి.. సామాజిక బాధ్యతగా ప్రజలు కొవిడ్‌ నిబంధనలు పాటిస్తుంటే.. ఆ ప్రాంతాల్లో మాత్రం లాక్‌డౌన్లు తొలగించ వచ్చన్నారు. పరీక్షలను పెంచి.. జిల్లా స్థాయిలో కంటైన్ మెంట్లు ఏర్పాటు చేయడం అంత ప్రభావవంతంగా ఉండదని చెప్పారు. లాక్‌డౌన్‌లను అత్యంత నెమ్మదిగా సడలించాలని అభిప్రాయపడ్డారు. కాగా, భార్గవ చెప్పిన సలహాలను ఇప్పటివరకు నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ అధికారిక మార్గదర్శకాల్లో చేర్చలేదు.

జులై మధ్య నాటికి లేదా ఆగస్టు మొదటి వారం నాటికి దేశంలో రోజుకు కోటి మందికి టీకాలు అందించే అవకాశం ఉంది. టీకాలకు కొరత లేదు. ప్రస్తుతం దేశంలో అందరు టీకాలు వేయించుకోవాలనుకుంటున్నారు. దేశం మొత్తానికి ఒక్క నెలలో టీకాలు వేయలేము కదా. మన జనాభా అమెరికా జనాభా కంటే నాలుగు రెట్లు ఎక్కువ. కొంత ఓపిక పట్టాలి. జులై మధ్య నాటికి, లేదా ఆగస్టు నాటికి రోజుకు కోటిమందికి టీకాలు వేసే అవకాశం ఉంది’’ అని వ్యాక్సినేషన్ పై బలరామ్ భార్గవ్ అన్నారు.

సెకండ్ వేవ్ లో కరోనా మహమ్మారి మన దేశంలో విలయతాండవం చేస్తోంది. రోజూ లక్షల సంఖ్యలో కేసులు, వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. అప్రమత్తమైన ప్రభుత్వాలు కరోనా కట్టడికి ఆంక్షలు విధించాయి. ఆ ఆంక్షలు ఫలితాలు ఇచ్చాయి. కరోనా తీవ్రత తగ్గింది.
ఏప్రిల్‌ 27 నుంచి మే 3 వరకు దేశవ్యాప్తంగా ఉన్న 21.39శాతం పాజిటివిటీ రేటు ప్రస్తుతం 8.3 శాతానికి తగ్గడమే ఇందుకు నిదర్శనం. మే 31 నాటికి దేశవ్యాప్తంగా 344 జిల్లాల్లో 5శాతం కంటే తక్కువ పాజిటివిటీ రేటు నమోదువుతోంది. మే మొదటి వారంలో ఈ స్థాయి పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాల సంఖ్య 92 మాత్రమే కావడం విశేషం. దేశవ్యాప్తంగా మే 7న 4 లక్షలకుపైగా కేసులు నమోదు కాగా.. బుధవారం(జూన్ 2,2021) వాటి సంఖ్య 1.32 లక్షలకు తగ్గింది.