వికలాంగ కుక్క కోసం రోబో తయారు చేసిన యువకుడు..

వికలాంగ కుక్క కోసం రోబో తయారు చేసిన యువకుడు..

Updated On : February 22, 2021 / 2:17 PM IST

lucknow man made robot for differently abled dog : ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు చెందిన ఒక యువకుడు ఓ కుక్క కోసం రోబో తయారు చేశారు. ఆ కుక్క బాగోగులు చూసుకోవటానికి రోబోను తయారు చేశాడు. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ కుక్క కోసం ఆ యువకుడు చూపిన పెద్ద మనస్సు..ఫిదా అవుతున్నారు జనాలు..గాయాలతో బాధపడుతున్న ఆ కుక్క మనుషులెవరినీ దగ్గరకు రానివ్వటంలేదు.దీంతో రోబోను తయారు చేసి దానిని సంరక్షించటానికి ఆ రోబోను తయారు చేశాడు లక్నోకు చెందిన మిలింద్‌రాజ్ అనే యువకుడు.   లక్నోలోని గోమతి నగర్‌కు చెందిన మిలింద్‌రాజ్ లాక్‌డౌన్ సమయంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఓ కుక్కను చూశాడు. దానికేమైదో తెలుసుకుని సహాయం చేద్దామని దాని దగ్గరకు వెళ్లి చూడబోయాడు. కానీ అప్పటికే భయపడిపోతున్న ఆ కుక్క అతనిని దగ్గరకు రానివ్వలేదు. అలా ఎవ్వరినీ దగ్గరకు రానివ్వటంలేదు. పైగా ఆ కుక్కకు కళ్లు సరిగా కనిపించకపోవడంతో పాటు చెవులు కూడా వినిపించవు.

పైగా గాయపడి ఉంది. అది గమనించిన మిలింద్ రాజ్ దాన్ని చూసి చలించిపోయాడు.దానికి ఎలాగైనా సహాయం చేయాలనుకున్నాడు. చేరదీశాడు. వైద్యం చేయించాడు. దానికి జోజో అని పేరు కూడా పెట్టాడు.దాన్ని సంరక్షించటానికి ఓ రోబోను తయారు చేసాడు.

‘డ్రోన్ మ్యాన్‘గా గుర్తింపు పొందిన మిలింద్ రాజ్ ఆ కుక్కని అతి జాగ్రత్తగా పశువుల డాక్టర్ దగ్గరకు చూపించాడు. . చప్పుడు చేయకుండా అతి జాగ్రత్తగా దాన్ని పరిశీలించిన డాక్టర్ ఆ కుక్క మనుషులకు దూరంగా ఉండాలనుకుంటోందని తెలిపారు.దీంతో మిలింద్‌రాజ్ ఆ కుక్కను సంరక్షించేందుకు ఒక రోబోను తయారు చేశాడు. శునకానికి ఆ రోబో అన్ని రకాలుగా..అచ్చం మనిషిలాగా సమాయం చేస్తోంది. సమయానికి ఆహారం అందించటం..పాలు, బిస్కెట్లు ఇవ్వటం వంటివన్నీ చేస్తోంది.

ఆ రోబో నిరంతరం ఆ శునకాన్ని కనిపెట్టుకునే ఉంటుంది. అలా రోబోను శునకం గుర్తిస్తోంది. అది తనకు ఎటువంటి హాని చేయదు..జాగ్రత్తగా చూసుకుంటోందని నమ్మింది. దాంతో ఆ రోబోని ఆ కుక్క ఇష్టపడుతోంది. అలా అలా గాయాలతో తల్లడిల్లిపోయిన ఆ కుక్క కోలుకుంది.

ఈ సందర్భంగా మిలింద్‌రాజ్ మాట్లాడుతూ.. గత ఏడు నెలలుగా ఆ కుక్క బాగోగులు చూసుకుంటున్నాననీ..ఎవ్వరినీ దగ్గరకు రానిచ్చేది కాదు. దీంతో దాని కోసం ఓ రోబోను తయారు చేసానని తెలిపారు. ఇప్పుడు ఆకుక్క ఆరోగ్యం కూడా మెరుగుపడిందని తెలిపాడు.