Mumbai Bus Tragedy: ముంబైలో బస్సు బీభత్సం.. జనాలపైకి దూసుకెళ్లిన బస్సు, నలుగురు మృతి

ముంబైలో బస్సు బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన పాదాచారులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించగా..

Mumbai Bus Tragedy: ముంబైలో బస్సు బీభత్సం.. జనాలపైకి దూసుకెళ్లిన బస్సు, నలుగురు మృతి

Mumbai Bus Tragedy

Updated On : December 10, 2024 / 7:17 AM IST

Mumbai accident : ముంబైలో బస్సు బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన పాదాచారులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించగా.. మరో 25 మంది గాయపడ్డారు. పలు వాహనాలు ద్వంసం అయ్యాయి. కుర్లావెస్ట్ లోని ఎస్జీబార్వే మార్గ్ లోని అంజమ్-ఇ-ఇస్లాం పాఠశాల సమీపంలో సోమవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన బెస్ట్ (బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్ పోర్ట్) బస్సు అదుపు తప్పి వేగంగా పాదాచారులపైకి దూసుకెళ్లడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. గాయపడిన వారిని హుటాహుటీన స్థానిక ఆస్పత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ సంజయ్ మోరే (50)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Also Read: Syria Civil War : సిరియాను వెంటాడుతున్న ఆ కొత్త భయం ఏంటి? ఆ దేశ ప్రజలు ఎందుకు ఆందోళన చెందుతున్నారు?

ముంబైలోని కుర్లా ప్రాంతంలో సోమవారం రాత్రి 10.45గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కుర్లావెస్ట్ నుంచి అంధేరికి వెళ్తున్న 332 నంబర్ బస్సు కుర్లా స్టేషన్ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే బస్సు పాదాచారులపైకి దూసుకెళ్లింది. బస్సు బ్రేక్ డౌన్ కావడం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తొలుత పోలీసులు భావించగా.. ప్రాథమికంగా బస్సు బ్రేకులు బాగానే ఉన్నాయని రాష్ట్ర రవాణాశాఖ అధికారులు తెలిపారు. అయితే, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంలో మృతిచెందిన వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

 

బస్సు అదుపుతప్పి వాహనాలు, పాదాచారులను ఢీకొట్టిన ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. బస్సు వాహనాలను ఢీకొనడంతో జనం అక్కడి నుంచి పరుగులు తీశారు.