వచ్చేస్తున్నాయ్ : మార్చిలోనే ఎన్నికలు!
జూన్ 3 తో పదవీ కాలం ముగిసే లోక్ సభ ఎన్నికలతో పాటు, ఆంధ్రప్రదేశ్, ఒడిషా, సిక్కిం,అరుణాచలప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిపేందుకు కేంద్ర ఎన్నికల సంఘాం సమాయత్తమవుతోంది.

జూన్ 3 తో పదవీ కాలం ముగిసే లోక్ సభ ఎన్నికలతో పాటు, ఆంధ్రప్రదేశ్, ఒడిషా, సిక్కిం,అరుణాచలప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిపేందుకు కేంద్ర ఎన్నికల సంఘాం సమాయత్తమవుతోంది.
ఢిల్లీ: ఈ ఏడాది జూన్ 3 తో పదవీకాలం ముగిసే ప్రస్తుత లోక్ సభకు ఎన్నికలు నిర్వహించే తేదీని మార్చి మొదటివారంలో ప్రకటించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. జూన్ 3 లోపే ఎన్ని దశల్లో పోలింగ్ నిర్వహించాలి, ఏయే నెలల్లో జరపాలి అనే అంశాలపై ఎన్నికల సంఘం ప్రణాళిక రూపోందిస్తోంది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన భద్రతా బలగాలు అందుబాటులో ఉండే అంశాల ఆధారంగా ఎన్నికలు ఎన్నిదశల్లో నిర్వహించలనేది నిర్ణయిస్తారు.
గతంలో అనుసరించిన సంప్రదాయాల ప్రకారం లోక్ సభ ఎన్నికలతోపాటు కాలపరిమితి ముగియనున్న ఆంధ్రప్రదేశ్, ఒడిషా, సిక్కిం,అరుణాచలప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిపే అవకాశం ఉంది. రద్దయిన జమ్మూ కాశ్మీర్ విధానసభకు కూడా ఎన్నికలు నిర్వహించే అవకాశం లేకపోలేదు. సాధారఁణంగా అన్ని అసెంబ్లీలకు 5 ఏళ్ల కాలపరిమితి ఉంటే జమ్మూ కాశ్మీర్ కు మాత్రం 6 ఏళ్లు ఉంటుంది. శాంతిభద్రతల పరిస్ధితి దృష్ట్యా జమ్ము కాశ్మీర్లో మందుగానే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించవచ్చు. జమ్ము కాశ్మీర్ అసెంబ్లీకి 2021 మార్చి 16 వరకు గడువు ఉన్నప్పటికీ, 2018 నవంబర్ లో శానస సభను రద్దు చేసినందున అప్పటినుంచి ఆరునెలల్లోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. కనుక జమ్ము కాశ్మీర్ కు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.