Nitin Gadkari : గుంతలు లేని హైవేలే లక్ష్యంగా చర్యలు : మంత్రి నితిన్ గడ్కరీ

గుంతలు లేని రోడ్లపై ఇకపై వాహనాలు రయ్ మంటు దూసుకుపోవచ్చు. ఇక హైవేలపై గుంతలు లేకుండా ఉండేలా కేంద్రం చర్యలు తీసుకుంటోంది.

Nitin Gadkari : గుంతలు లేని హైవేలే లక్ష్యంగా చర్యలు : మంత్రి నితిన్ గడ్కరీ

Nitin Gadkari pothole free On highways

Updated On : September 29, 2023 / 2:53 PM IST

Union minister Nitin Gadkari : గుంతలు లేని నేషనల్ హైవేల కోసం చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. వర్షాల వల్ల దెబ్బతిని హైవేలపై గుంతలు ఏర్పడతుంటాయని..ఇక గుంతలు లేని రోడ్ల కోసం ఓ కొత్త పాలసీని పరిశీలిస్తున్నామని తెలిపారు. గుంతలు లేని రోడ్లే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గురువారం (సెప్టెంబర్ 28)న మీడియాతో మాట్లాడుతు..డిసెంబర్ (2023)నాటికి దేశ వ్యాప్తంగా ఉన్న రహదారులపై గుంతలు లేకుండా చేసుందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. జాతీయ రహదారుల వెంబడి డ్రైనేజీ సమస్యలపై ఫిర్యాదులు వచ్చాయని, వాటిని కూడా పరిష్కరించేందుకు కొత్త విధానాన్ని రూపొందిస్తున్నామని మంత్రి తెలిపారు.

అలాగే హైవేల వెంట ఉండే డ్రైనేజీ వ్యవస్థ సమస్యలను కూడా ఈ కొత్త విధానంలో పరిశీలిస్తామని తెలిపారు. మున్సిపల్ వ్యర్ధాలను రోడ్ల నిర్మాణంలో ఉపయోగించటం కోసం మరో కొత్త విధానాన్ని రూపొందిస్తున్నామని తెలిపారు. ఈ విషయంలో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. వ్యర్థాలు దేశానికి పెద్ద సమస్యగా ఉందని తెలిపిన మంత్రి ఇటువంటి విధానాన్ని అమలు చేస్తే దేశానికి ప్రయోజన చేకూరుతుందని అభిప్రాయపడ్డారు.

Basangouda Patil : భారత తొలి ప్రధాని నెహ్రూ కాదు..సుభాష్ చంద్రబోస్ : బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు

2070 నాటికి సున్నా వ్యర్థాలు (నెట్ జీరో) అనే ప్రధానమంత్రి దార్శనికతను సాధించేందుకు ఈ విధానం భారత్‌కు దోహదపడుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు. ప్రత్యామ్నాయ ఇంధనాన్ని ఉపయోగించి నిర్మాణ యంత్రాలను ప్రోత్సహించే విధానం కోసం ముసతాయిదా సిద్దమైందని..అది ఆమోదం కోసం త్వరలోనే ఆర్థిక మంత్రిత్వ శాఖతో చర్చలు జరుపుతామని వెల్లడించారు. 2047 నాటికి భారత్‌ను కార్బన్ న్యూట్రల్ దేశంగా మార్చాలన్న ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యానికి అనుగుణంగా ఈ ప్రతిపాదన ఉందని గడ్కరీ తెలిపారు.

Punjab : పోలీసు వాహనంపై వేళ్లతో సైగలు చేస్తు యువతి ఇన్‌స్టా రీల్స్‌.. అనుమతించిన అధికారి సస్పెండ్

ఢిల్లీలో గడ్కరీతో కలిసి విలేకరుల సమావేశంలో పాల్గొన్న రోడ్డు రవాణా,రహదారుల కార్యదర్శి అనురాగ్ జైన్ మాట్లాడుతు..పనితీరు ఆధారిత నిర్వహణ, స్వల్పకాలిక నిర్వహణ ఒప్పందాలను పటిష్ఠం చేస్తోందని తెలిపారు. బిల్ట్-ఆపరేట్-ట్రాన్స్‌ ఫర్ (BOT) పద్ధతిలో రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నామని..అటువంటి ప్రాజెక్టులు రోడ్లను మెరుగైన పద్ధతిలో నిర్వహిస్తున్నాయని వెల్లడించారు.