మోహన్‌బాబుతో భేటీపై మోడీ ట్వీట్‌

టాలీవుడ్‌ నటుడు మోహన్‌బాబు తనతో సమావేశం కావడంపై ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్‌ చేశారు. మోహన్‌బాబు కుటుంబంతో, సమావేశం కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.

  • Published By: veegamteam ,Published On : January 7, 2020 / 02:44 AM IST
మోహన్‌బాబుతో భేటీపై మోడీ ట్వీట్‌

Updated On : January 7, 2020 / 2:44 AM IST

టాలీవుడ్‌ నటుడు మోహన్‌బాబు తనతో సమావేశం కావడంపై ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్‌ చేశారు. మోహన్‌బాబు కుటుంబంతో, సమావేశం కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.

టాలీవుడ్‌ నటుడు మోహన్‌బాబు తనతో సమావేశం కావడంపై ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్‌ చేశారు. మోహన్‌బాబు కుటుంబంతో, సమావేశం కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తమ మధ్య చాలా విషయాలపై మంచి చర్చ జరిగిందని తెలిపారు. సినిమా ప్రాముఖ్యత, ప్రజల మధ్య సాంస్కృతిక సంబంధాలు ఎలా పెంచవచ్చు అనే అంశాలపై చర్చించామని మోడీ ట్వీట్‌ చేశారు. దీంతో పాటు మోహన్‌బాబు కుటుంబంతో మోడీ కలిసిన ఫొటోను పోస్ట్‌ చేశారు. మోడీతో సమావేశం సందర్భంగా ‘వాట్‌ ఏ మ్యాన్‌!’ అని పేర్కొంటూ ఈ మధ్యాహ్నం మోహన్‌ బాబు చేసిన ట్వీట్‌ను దీనితో ప్రధాని జత చేశారు.   

 

వైసీపీ కీలక నేత మంచు మోహన్‌బాబు ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీని కలిశారు. కూతురు లక్ష్మీప్రసన్న, కొడుకు విష్ణు, కోడలు వెరోనికతో కలిసి పీఎంవోకు వెళ్లిన మోహన్‌బాబు… సుమారు 45 నిమిషాల పాటు ప్రధానితో మంతనాలు జరిపారు. అనంతరం బీజేపీ చీఫ్ అమిత్‌షాను కూడా కలిశారు. సీఏఏపై ప్రజల్లో అవగాన కల్పించే కార్యక్రమంలో అమిత్ షా బిజీగా ఉన్నప్పటికీ.. మోహన్‌బాబు ఫ్యామిలీ కోసం టైమ్ కేటాయించడం విశేషం. అమిత్‌షాతో భేటీ తర్వాత మోహన్‌బాబు కుటుంబం… హోం సెక్రటరీని కలవడం హాట్‌ టాపిక్‌గా మారింది.
గతేడాది ఏపీ అసెంబ్లీ ఎన్నికల టైమ్‌లో మంచు ఫ్యామిలీ అధికారికంగా వైసీపీలో చేరింది. జగన్ తరఫున వారు పెద్దఎత్తున ప్రచారం కూడా నిర్వహించారు. ఒక దశలో మోహన్‌బాబుకు చిత్తూరు జిల్లా నుంచి ఏదో ఒక స్థానంలో టికెట్ ఇస్తారనే ప్రచారం జరిగింది. వైసీపీ భారీ మెజార్టీ సాధించి జగన్ సీఎం అయిన తర్వాత… మోహన్‌బాబుకు నామినేటెడ్ పదవి ఇవ్వబోతున్నారనే వార్తలొచ్చాయి.

 

కానీ అవేవీ నిజం కాలేదు. ఈ క్రమంలో మంచు ఫ్యామిలీతో వెళ్లి మోడీని కలవడంతో… జగన్‌కు, మోహన్‌బాబుకు చెడిందేమోనన్న ఊహాగానాలు గుప్పుమన్నాయి. మంచు ఫ్యామిలీ బీజేపీలో చేరడం ఖాయమని ప్రచారం సాగింది. కానీ కలెక్షన్‌ కింగ్‌ మాత్రం అవన్నీ ఒట్టి పుకార్లేనని కొట్టి పారేశారు. జగన్‌ను కాదని… ఇక్కడికి రాలేదంటూ క్లారిటీ ఇచ్చేశారు.