భారత రాజ్యాంగానికి 70ఏళ్లు

భారత రాజ్యాంగాన్ని ఆమోదించి ఇవాళ్టికి 70 ఏళ్లు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నారు. 1949లో ఇదే రోజున(నవంబర్ 26) భారత

  • Published By: veegamteam ,Published On : November 26, 2019 / 02:35 AM IST
భారత రాజ్యాంగానికి 70ఏళ్లు

Updated On : November 26, 2019 / 2:35 AM IST

భారత రాజ్యాంగాన్ని ఆమోదించి ఇవాళ్టికి 70 ఏళ్లు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నారు. 1949లో ఇదే రోజున(నవంబర్ 26) భారత

భారత రాజ్యాంగాన్ని ఆమోదించి ఇవాళ్టికి 70 ఏళ్లు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నారు. 1949లో ఇదే రోజున(నవంబర్ 26) భారత రాజ్యాంగానికి రాజ్యాంగ సభ ఆమోదం తెలిపింది. అందుకే ప్రతి ఏటా నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. నవంబర్ 26ను నేషనల్ లా డే.. లేదా ..సంవిధాన్ దివస్‌గానూ పిలుస్తారు. 1950 జవనరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. 

భారత రాజ్యాంగ రచనకు ఎన్నికైన రాజ్యాంగ పరిషత్ వివిధ అంశాల పరిశీలనకు 22 కమిటీలను, 7 ఉప కమిటీలను ఏర్పాటు చేసింది. వీటిలో అత్యంత ముఖ్యమైన ముసాయిదా కమిటిని 1947 ఆగస్టు 29న బీఆర్ అంబేద్కర్ అధ్యక్షతన ఆరుగురు సభ్యులతో ఏర్పాటు చేశారు. రాజ్యాంగ పరిషత్ 11సార్లు సమావేశమైంది. ముసాయిదా తయారీలో భాగంగా అంబేద్కర్ స్వయంగా 60 దేశాలకు చెందిన రాజ్యాంగాలను చదివారు. మొత్తంగా రెండేళ్ల 11 నెలల 18 రోజులపాటు కష్టించి.. సుదీర్ఘ మేధోమథనం తర్వాత ముసాయిదా కమిటీ హిందీ, ఇంగ్లీష్‌లో కాపీలను తయారు చేసింది. దీనిపై రాజ్యాంగ పరిషత్‌లో 115రోజులు చర్చించి.. 2వేల 473 సవరణలతో 1949 నవంబర్ 26న ఆమోదించారు.

యేటా నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవాలని 2015, నవంబర్ 19న భారత ప్రభుత్వం ప్రకటించింది. అంబేద్కర్ 125వ జయంతి వేడుకలను సందర్భంగా ముంబైలో ఆయన విగ్రహానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా ప్రధాని ఈ ప్రకటన చేశారు. అంబేద్కర్‌కు నివాళిగా రాజ్యాంగ దినోత్సవం జరుపుతున్నట్టు కేంద్రం ప్రకటించింది. రాజ్యాంగ దినోత్సవం పబ్లిక్ హాలిడే కాదు. కానీ…ప్రభుత్వ విభాగాల్లో రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహిస్తారు.

గత నాలుగేళ్లుగా రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నా.. ఈసారి వేడుకలకు మాత్రం ఓ స్పెషాలిటీ ఉంది. ఆర్టికల్‌ 370ను ఇటీవల కేంద్రం రద్దు చేయడంతో….ఈ ఏడాది తొలిసారిగా జమ్మూ కశ్మీర్ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. సంవిధాన్ దివస్ సందర్భంగా.. జమ్మూ కశ్మీర్లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లో ఉదయం 11 గంటలకు ప్రతిజ్ఞ చేయడంతోపాటు రాజ్యాంగ పీఠికను చదవనున్నారు.

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మంగళవారం(నవంబర్ 26,2019) పార్లమెంటులో ఘనంగా వేడుకలు నిర్వహించనున్నారు. సెంట్రల్‌ హాల్‌లో జరిగే ఉభయసభల చరిత్రాత్మక సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ, స్పీకర్‌ ఓం బిర్లా ప్రసంగిస్తారు. ఉదయం 11 గంటలకు.. కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులు, రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల అధిపతులు రాజ్యాంగంలోని ప్రవేశిక చదవాల్సిందిగా కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి లేఖలు పంపారు. రాజ్యాంగంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏడాదిపాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.