ఫడ్నవీసే సీఎం.. అప్పుడే చెప్పాం: అమిత్ షా ప్రకటన
మా కూటమి గెలిస్తే దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం అవుతారని ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు నేను చాలా సార్లు బహిరంగంగా...

మా కూటమి గెలిస్తే దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం అవుతారని ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు నేను చాలా సార్లు బహిరంగంగా…
బీజేపీ ప్రెసిడెంట్, కేంద్ర హోం మంత్రి మహారాష్ట్ర రాజకీయ పరిస్థితులపై నోరు విప్పారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ-శివసేన కూటమి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే ఫడ్నవీస్ మహారాష్ట్ర సీఎం అవుతాడని తానూ, ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగంగా చెప్పినట్లు గుర్తు చేశారు.
‘మా కూటమి గెలిస్తే దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం అవుతారని ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు నేను చాలా సార్లు బహిరంగంగా చెప్పాను. అప్పుడు ఎవ్వరికీ అభ్యంతరాలు ఉండవు. కానీ, వారు మాకు నచ్చని కొత్త డిమాండ్లతో వచ్చారు’ అని అమిత్ షా ఇంగ్లీష్ మీడియాతో జరిగిన ఇంటర్వ్యూలో చెప్పారు.
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు ఇచ్చిన సమయం గురించి మాట్లాడిన షా.. ‘దీని కంటే ముందు ఏ రాష్ట్రానికి ఇంత సమయం కేటాయించలేదు. 18రోజులు ఇచ్చాం. శివసేన, కాంగ్రెస్, బీజేపీలు కాదు. అసెంబ్లీ పదవీ కాలం ముగిసిన దాన్ని బట్టి గవర్నరే పార్టీలను ఆహ్వానించారు. ఈరోజున ఏ పార్టీ అయినా సంఖ్యాపరంగా బలంగా ఉంటుందో అది గవర్నర్‌ను కలవొచ్చు’ అని షా వెల్లడించారు.