స్నేహితురాలే ప్రియురాలు : పెళ్లి పీటలెక్కనున్న హార్థిక్ పటేల్

  • Published By: venkaiahnaidu ,Published On : January 21, 2019 / 06:49 AM IST
స్నేహితురాలే ప్రియురాలు : పెళ్లి పీటలెక్కనున్న హార్థిక్ పటేల్

Updated On : January 21, 2019 / 6:49 AM IST

పటేదార్ రిజర్వేషన్ల ఉద్యమ నేత హార్థిక్ పటేల్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన చిన్ననాటి స్నేహితురాలు కింజల్ పరిఖ్ ను హార్థిక్ వివాహం చేసుకోన్నాడు. జనవరి 27న గుజరాత్ రాష్ట్రంలోని సురేంద్రనగర్ జిల్లాలోని ములి తాలుకాలోని దిగ్సర్ గ్రామంలో వీరి వివాహం జరుగనుంది. దిగ్సర్ గ్రామంలోని హార్థిక్ ఫ్యామిలీ కులదైవమైన బహుచార్ అండ్ మెల్దీ మాతా ఆలయంలో  కేవలం 100మంది గెస్ట్ లతో చాలా సింపుల్ గా వీరి వివాహ కార్యక్రమం జరుగనుందని సన్నిహిత వర్గాలు తెలిపాయి.

వివాహ అనంతరం దంపతులు హార్థిక్ స్వస్థలం విరంగ్రంకు వెళతారని సన్నిహితులు తెలిపారు. అహ్మదాబాద్ జిల్లాలోని విరంగ్రం తాలుకాలోని చందన్నగిరి గ్రామంలోని ఒకే ప్రదేశంలో చిన్ననాటి నుంచి వీరిద్దరూ పెరిగారు. తాము కింజల్ తల్లిదండ్రులు వీరిద్దరికీ జనవరి 27న పెళ్లి చేయాలని నిర్ణయించామని హార్థిక్ తండ్రి భరత్ పటేల్ తెలిపారు. కింజల్ కూడా పటేదార్ కమ్యూనిటీకి చెందిన అమ్మాయేనని ఆయన తెలిపారు. సూరత్ కి చెందిన కింజల్ ఫ్యామిలీ చాలా ఏళ్ల క్రితం వీరంగ్రంలో సెటిల్ అయ్యారని ఆయన తెలిపారు. హార్థిక్, కింజల్ చిన్నతనం నుంచి మంచి స్నేహితులని, వారిని మంచి దంపతులుగా చేయాలని తాము వారికి వివాహం చేయాలని నిర్ణయించామని భరత్ పటేల్ తెలిపారు.