Paytm : పేటీఎం ఫ్లాప్ షో…లబోదిబోమంటున్న ఇన్వెస్టర్లు

అతిపెద్ద ఐపీవోగా ఉన్న పేటీఎం ఇటీవలే ప్రజల ముందుకు వచ్చింది. లాభాల బాటల్లో పయనిస్తుందని అనుకున్న ఇన్వెస్టర్లు ఇప్పుడు లబోదిబోమంటున్నారు.

Paytm : పేటీఎం ఫ్లాప్ షో…లబోదిబోమంటున్న ఇన్వెస్టర్లు

How Paytm Ceo Vijay Shekhar Sharma Went From Making Rs. 10,000 A Month To Becoming A Billionaire

Updated On : November 23, 2021 / 6:52 AM IST

Paytm Shares : అతిపెద్ద ఐపీవోగా ఉన్న పేటీఎం ఇటీవలే ప్రజల ముందుకు వచ్చింది. లాభాల బాటల్లో పయనిస్తుందని అనుకున్న ఇన్వెస్టర్లు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. పతనం దిశగా ముందుకెళుతోంది. పేటీఎం షేర్లు ఢమాల్ అంటుండడంతో పేటీఎం ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ సంపద ఆవిరైపోతోంది. సుమారు 1.5 బిలియన్‌ డాలర్లు (10 వేల కోట్ల రూపాయలకు పైగా) సంపద కరిగిపోయనట్లు తెలుస్తోంది. ఐపీవో ద్వారా 2.5 బిలియన్‌ డాలర్లకు చేరిన శర్మ సంపద.. సోమవారం ఉదయం నాటికి 781 మిలియన్‌ డాలర్లకు చేరుకుందని అంచనా.

Read More : Somu Veerraju : కోర్టు నుంచి తప్పించుకునేందుకే 3 రాజధానుల బిల్లు వెనక్కి

2021, నవంబర్ 22వ తేదీ సోమవారం మార్కెట్ లో పేటీఎం షేర్లు తుస్సుమన్నాయి. మధ్యాహ్నం పేటీఎం మాతృక సంస్థ వన్ 97 కమ్యూనికేషన్ షేర్ల విలువ 14 శాతం పతనంతో రూ. 1,348.30 వద్ద కొనసాగుతోంది. ఇన్వెస్టర్ల 63 వేల కోట్ల సంపద తుడిచిపెట్టుకపోయింది. పేటీఎంలో 9.1 శాతం వాటా కలిగి ఉన్న శర్మ…ఆరుకోట్ల షేర్లు, 2.1 కోట్ల ఆప్షన్ కలిగి ఉన్నారు. ఐపీవోలో రికార్డు సృషించిన..పేటీఎం షేర్లు..2021, నవంబర్ 18వ తేదీ గురువారం లిస్టింగ్ లోకి ఎంటర్ అయ్యింది.

Read More : Jeff Bezos : కొన్నేళ్ల తర్వాత మనిషి పుట్టుక అంతరిక్షంలోనే..పర్యాటక ప్రదేశంగా భూమి!

ఇష్యూ ప్రైస్ గా రూ. 2150గా మార్కెట్ లోకి ఎంటరైంది. ఒక్క షేర్ ధర రూ. 1950గా మొదలైంది. కేవలం గంటల వ్యవధిలో…షేర్ల ధర క్షీణిస్తూ వచ్చింది. రూ. 38 వేల కోట్ల పేటీఎం పెట్టుబడిదారుల సంపద తుడిచిపెట్టుకపోయింది. ప్రస్తుతం ఇన్వెస్టర్లు లబోదిబోమంటున్నారు. మరి లాభాల బాట పడుతుందా ? నష్టాల్లోనే కొనసాగుతందా ? అనేది రానున్న రోజుల్లో చూడాలి.