అయోధ్య పర్వం : ..హనుమాన్ గఢీలో మోడీ పూజలు

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అయోధ్యకు చేరుకున్నారు. ఉదయం 11.44 గంటలకు హనుమాన్ గఢీకి చేరుకున్న మోడీ…ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న మోడీకి..యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ స్వాగతం పలికారు.
అనంతరం హనుమాన్ స్వామిని దర్శించుకుని హారతి ఇచ్చారు. ఆలయం చుట్టూ ప్రదిక్షణలు చేశారు. అక్కడున్న నిర్వాహకులు మోడీకి తలపాగా ధరించారు. అనంతరం రామజన్మభూమి ప్రాంగణానికి బయలుదేరారు.
మధ్యాహ్నం 12.44 గంటలకు రామాలయానికి భూమి పూజ చేయనున్నారు మోడీ. మోడీ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
రామాలయం నిర్మాణానికి శంకుస్థాపన జరుగుతున్న సందర్భంగా అయోధ్య సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. జై శ్రీరాం..జై హనుమాన్ అనే నినాదాలతో మారుమోగుతున్నాయి.
రామాలయ నిర్మాణం కేవలం మూడు సంవత్సరాల్లో పూర్తి చేయనున్నారు. కోట్లాది మంది హిందువుల కల సాకారం కానుంది. ఈ పూజా కార్యక్రమంలో మోడీతో పాటు కొద్దిమంది ప్రముఖులు మాత్రమే హాజరు కానున్నారు. ఇంటిలిజెన్స్ హెచ్చరికలు, కరోన నేపథ్యంలో 175 మందిని మాత్రమే ఆహ్వానించారు.
బుధవారం ఉదయం 9.30 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక జెట్ విమానంలో మోడీ అయోధ్యకు చేరుకున్నారు. లక్నో చేరుకుని..ఉదయం 10.40 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ లో అయోధ్యకు చేరుకున్నారు. 11.40 గంటలకు హనుమాన్ గఢీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
ఇక్కడ మూడు రోజుల నుంచి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. దేశంలో కరోనా వ్యాప్తి తగ్గాలని, దేశ ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుతూ..వేద మంత్రాలు చదువుతున్నారు. మోడీ పసుపు కుర్తా మరియు తెలుపు ధోతీ ధరించి ఉన్నారు. హిందూ మతం ప్రకారం, ప్రార్థనల రంగులు రూపంలో కనిపించాయి. మెడలో హారము ధరించి విమానం ఎక్కారు.