COVID-19: ప్రధాని, రాష్ట్రపతి, ఎంపీల జీతాల్లో కోత

దేశాధ్యక్షుల నుంచి ప్రజాప్రతినిధులు వరకూ ప్రతి ఒక్కరి జీతంలోనూ కోత విధించింది ప్రభుత్వం. కొవిడ్ 19పై పోరాడేందుకు నిధులు సమకూర్చుకునే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. లాక్ డౌన్ ప్రకటించడంతో భారత ఎకానమీపై పెను ప్రభావమే పడింది. ఇప్పుడీ రకంగా జీతాల్లో కోత విధించి దానిని ప్రభుత్వ నిధులకు జోడించాలని యోచిస్తుండి గవర్నమెంట్.
ఈ మేర రాష్ట్రపతి, ప్రధాని, ఎంపీల జీతాల్లో 30శాతం కట్ అవుతుంది. ఇదేగాక, ఎంపీల్యాడ్స్ స్కీంను రెండేళ్ల పాటు రద్దు చేస్తున్నట్లు అప్రూవ్ చేసింది క్యాబినెట్. కన్సోలిడేట్ ఫండ్ కింద రూ.7వేల 900కోట్లు ఎంపీల్యాడ్స్ స్కీం నుంచి ప్రభుత్వానికి అందుతాయని కేంద్ర మంద్రి ప్రకాశ్ జవదేవకర్ తెలిపారు.
కేంద్ర మంత్రి జవదేకర్, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడితో పాటు అన్ని రాష్ట్రాల గవర్నర్లు కలిసి సంవత్సరం పాటు జీతాల్లో కోత ఉంటుందని నిర్ణయం తీసుకున్నారు.
See Also | కరోనా.. అమెరికా వైద్యుల ప్రయోగం : రక్తాన్ని దానం చేయడానికి ముందుకు వచ్చిన మహిళ