NRCపై ప్రభుత్వం వెనక్కు తగ్గనుందా!!

NRCపై ప్రభుత్వం వెనక్కు తగ్గనుందా!!

Updated On : December 21, 2019 / 6:24 AM IST

కొత్త పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి  వస్తున్న తిరస్కరణలు, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాల నుంచి సైతం వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో బీజేపీ ఎన్నార్సీ విషయంలో కాస్త వెనక్కి తగ్గే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జేడీ(యూ) ప్రెసిడెంట్, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మాట్లాడుతూ.. ఎన్నాఆర్సీ బీహార్‌లో అమలుకాదు. లోక్‌జనశక్తి పార్టీ ప్రెసిడెంట్ చిరాగ్ పాశ్వాన్ సాధారణ ప్రజానీకానికి ఇబ్బంది కలుగజేసే ఇటువంటి చట్టాలకు ఎప్పుడూ సపోర్ట్ చేయనని అన్నారు. 

పట్నాలో ఎన్నాఆర్సీపై మౌనం వీడిన నితీశ్ ఇలా స్పందించారు. ఎన్నాఆర్సీని ఎందుకు అమలుచేయాలి. బీహార్ లో ఎన్నటికీ అమలుకాదు. దేశంలో జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే సీఏబీ, ఎన్నాఆర్సీని కలిపి అమలుచేసేలా ఉంది. ఇలా చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైనట్లు స్పష్టమైంది కూడా. లోక్‌జనశక్తి ప్రెసిడెంట్ చిరాగ్ పాశ్వాన్ హోం మంత్రి అమిత్ షాకు రాసిన లెటర్ ను ట్వీట్ చేశాడు. పార్లమెంట్ లోకి ప్రవేశపెట్టే ముందు సీఏబీ ఓసారి మీట్ అయి చర్చించుకుంటే బాగుంటుందని రాసుకొచ్చాడు. 

కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తాస్ అబ్బాస్ నఖ్వీ మాట్లాడుతూ.. ప్రభుత్వానికి దేశవ్యాప్తంగా ఎన్నాఆర్సీ అమలుచేయాలనే ఆలోచనే లేదని అన్నాడు. బీజేపీ జనరల్ సెక్రటరీ రామ్ మాధవ్ మాట్లాడుతూ.. ఎన్నాఆర్సీపై మాట్లాడటమనేది పరిణతి లేని ఆలోచన. దేశవ్యాప్తంగా అమలుచేయాలనే ఆలోచనే లేదు. ప్రస్తుతం పౌరసత్వ చట్టంపైనే ఫోకస్ పెడుతున్నాం. 2021నాటికి ఎన్నార్సీ తీసుకురావడం హోం మంత్రి వ్యూహం. అందుబాటులో వివరాలు లేకుండా మాట్లాడటం అవివేకం’ అని అన్నారు. 

షా మాటలను ఓ సారి గుర్తుచేస్తూ.. ఎన్నాఆర్సీ అనేది ఎవరికి వర్తిస్తుంది. ఇది భారతీయుల కోసం. కేవలం భారత ముస్లింల కోసమేనా? కాదు, అలా ఏం కాదు. ఎన్నాఆర్సీ వాటిపై ఏ ప్రభుత్వం రహస్యంగా ఏం చేయలేదు. అదే ప్రభుత్వం స్పష్టం చేయడానికి ప్రయత్నిస్తుంది. జాతీయవ్యాప్తంగా ఎన్నార్సీ అమలు జరగడంపై ఎటువంటి చర్చా జరగలేదు’ అని నఖ్వీ వెల్లడించారు. 

ఎన్నార్సీ అంటే భారత పౌరుల పేర్లు రిజిష్టర్ చేసుకునేది. ఎన్నార్సీ జాబితా తొలిసారి 1951లో నమోదైంది. ఆ తర్వాత జనాభా లెక్కల ప్రకారం.. ఎన్నార్సీ అప్‌డేట్ అవలేదు. ఇందులో భాగంగానే అస్సాంలో మాత్రమే ఎన్నార్సీ అమలుచేయాలనేది కేంద్ర ప్రభుత్వ ఆలోచన.