చెల్లెలు కోసం త్యాగం చేస్తున్నా: ఫేస్‌బుక్ లైవ్‌లో రాహుల్ గాంధీ

చెల్లెలు కోసం త్యాగం చేస్తున్నా: ఫేస్‌బుక్ లైవ్‌లో రాహుల్ గాంధీ

Updated On : June 23, 2023 / 11:01 AM IST

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన చెల్లెలు ప్రియాంక గాంధీ కోసం త్యాగం చేశారట. కాన్పూర్ ఎయిర్ పోర్ట్‌లో ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీకి మధ్య జరిగిన ఆసక్తికరమైన సంభాషణ ఇప్పుడు నెట్టింట్టో వైరల్ అవుతుంది.

అసలు విషయం ఏమిటంటే ఒక గుడ్ బ్రదర్ మాదిరిగా తన చెల్లెలు కోసం ఒక పెద్ద విమానాన్ని త్యాగం చేసి చిన్న హెలికాప్టర్‌లో వెళుతున్నానని రాహుల్ గాంధీ అన్నారు. నవ్వూతూ సరదాగా ఫేస్‌బుక్ లైవ్ పెట్టి మాట్లాడిన అన్నాచెల్లెల్లు వారి మధ్య ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తూ మాట్లాడారు.

ఎన్నికల ప్రచారం నిమిత్తం అనంతరం ఇద్దరూ వారి వారి ప్రత్యేక విమానాల్లో ఎన్నికల ప్రచారం నిమిత్తం వెళ్లారు.