Rahul Gandhi: అందుకే పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యం: రాహుల్ గాంధీ
లోక్‌సభలో ‘భద్రతా వైఫల్యం’పై కేంద్ర సర్కారుపై కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది. తామేం ఈ విషయాన్ని రాజకీయం చేయడం లేదని అంటోంది.

Rahul Gandhi
Lok Sabha: పార్లమెంట్‌లో ‘భద్రతా వైఫల్యం’పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీజేపీపై పలు ఆరోపణలు చేశారు. ‘ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విధానాల కారణంగా దేశంలో నెలకొన్న నిరుద్యోగం, ద్రవ్యోల్బణమే లోక్‌సభలో భద్రతా వైఫల్యానికి కారణం’ అని రాహుల్ గాంధీ మీడియాతో అన్నారు.
లోక్‌సభలో ‘భద్రతా వైఫల్యం’ పార్లమెంట్‌ను కుదిపేస్తున్న విషయం తెలిసిందే. పార్లమెంట్‌లో కొందరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, గ్యాస్ స్ప్రే చేసి కలకలం రేపడంతో ‘భద్రతా వైఫల్యం’ బయటపడింది. దీనిపై ఉభయ సభల్లో విపక్షాలు నిరసన తెలిపాయి.
పార్లమెంట్‌లో ‘భద్రతా వైఫల్యం’పై ఢిల్లీ పోలీసులు చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ గుర్తు చేస్తూ ప్రభుత్వంపై మండిపడ్డారు. ‘భద్రతా వైఫల్యం’ అంశాన్ని తామేమీ రాజకీయం చేయడం లేదన్నారు. ఢిల్లీ పోలీసులే భద్రతా వైఫల్యాన్ని ఉగ్రదాడి అంటూ కామెంట్లు చేశారని చెప్పారు.
ఈ అంశం కేంద్ర హోం శాఖ కిందకు వస్తుంది కదా? అని వేణుగోపాల్ నిలదీశారు. భద్రతా వైఫల్యాన్ని తాము ఉగ్ర దాడి అని అనలేదని చెప్పారు. భద్రతా వైఫల్యంపై తాము తమ ఆందోళనను మాత్రమే వ్యక్తం చేశామని అన్నారు.
Daggubati Purandhareswari : ఆడుదాం ఆంధ్రా ఏమోగానీ.. ఆంధ్రాతో మాత్రం జగన్ ఆడుకుంటున్నారు