రాహుల్ మానవత్వం…యాక్సిడెంట్ కు గురైన వ్యక్తిని కారులో హాస్పిటల్ కి

 ఆపదలో ఉన్న వ్యక్తిని ఆదుకోవడం ద్వారా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ జర్నలిస్ట్ ని తన కారులో హాస్పిటల్ కు తీసుకెళ్లారు.

  • Published By: venkaiahnaidu ,Published On : March 27, 2019 / 02:29 PM IST
రాహుల్ మానవత్వం…యాక్సిడెంట్ కు గురైన వ్యక్తిని కారులో హాస్పిటల్ కి

Updated On : March 27, 2019 / 2:29 PM IST

 ఆపదలో ఉన్న వ్యక్తిని ఆదుకోవడం ద్వారా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ జర్నలిస్ట్ ని తన కారులో హాస్పిటల్ కు తీసుకెళ్లారు.

ఆపదలో ఉన్న వ్యక్తిని ఆదుకోవడం ద్వారా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ జర్నలిస్ట్ ని తన కారులో హాస్పిటల్ కు తీసుకెళ్లారు. బుధవారం (మార్చి 27, 2019) సెంట్రల్ ఢిల్లీలో ఈ ఘటన జరిగింది.

రాజస్థాన్ కు చెందిన జర్నలిస్ట్ రాజేంద్ర వ్యాస్ బుధవారం సెంట్రల్ ఢిల్లీలోని హనుమాన్ రోడ్డుపై ప్రమాదానికి గురయ్యారు.నుదిటికి దెబ్బతగిలి రక్తమోడుతున్నఆయనను అటుగా వెళ్తున్న రాహుల్ గమనించారు.వెంటనే కారు ఆపి వ్యాస్ ని అందులో ఎక్కించుకుని ఢిల్లీ ఎయిమ్స్ హాస్సిటల్ కు తీసుకెళ్లారు.

వ్యాస్ ని రాహుల్ కారులో ఎక్కించి తీసుకువెళ్లడం ఆయన సిబ్బంది తీసిన వీడియాలో రికార్డ్ అయింది. ఇటీవల ఒడిషాలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాహుల్ వెళ్తున్న సమయంలో ఓ ఫోటో జర్నలిస్టు పొరపాటున మెట్లు జారి కిందకు పడటంతో రాహుల్ ఒక్క ఉదుటున కిందకు దిగి ఆయనకు చేయందించి పైకి లేపి అందరిచేత ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే.