రైల్వే గుడ్ న్యూస్: పండుగ సీజన్లో ప్రత్యేకంగా 2500 సర్వీసులు

పండుగ సీజన్లో ప్రయాణికులకు రైల్వే వ్యవస్థ శుభవార్త ప్రకటించింది. ప్రత్యేకంగా 200రైళ్లను ఏర్పాటు చేసి 2500 సర్వీసులను పెంచుతున్నట్లు తెలిపింది. కొద్ది రోజుల ముందే రైల్వేతో ఆధాయం పెంచుకునే దిశగా రైల్వేలోనూ ప్రైవేటికరణ తీసుకొచ్చారు. దీంతో పాటు పండుగలను పాయింట్ చేసి సర్వీసులను పెంచరాు.
దీపావళి పండుగను మొదలుకొని ఈ ఏడాది క్రిస్మస్ వరకూ ప్రత్యేక సర్వీసులు కొనసాగుతాయి. సాధారణంగా పండుగలంటే రైళ్లలో రష్ ఉండటం మామూలే. అటువంటిది పునరావృతం కాకుండా చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఢిల్లీ నుంచి పాట్నా, కోల్‌కతా, ముంబై, లక్నో, గోరక్‌పూర్, చాప్రా స్టేషన్లకు ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి.
అంతేకాదు, జనరల్ కంపార్టెమెంట్లలో తోసుకోవడం వల్ల జరిగే ప్రమాదాలు నివారించే విధంగా రిజర్వేషన్ లేని బోగీల వద్ద క్యూ పద్ధతిని మొదలుపెట్టేందుకు ఆర్‌పీఎఫ్ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. అన్ని ముఖ్య స్టేషన్లలో “May I Help You” హెల్ప్ డెస్క్‌లు పనిచేసేలా చూస్తున్నారు. ఆరోగ్యపరమైన సహకారం అందించే విధంగా మెడికల్ సిబ్బందిని ప్రధాన స్టేషన్లలో ఉంచుతున్నారు.