CD Scandal : బెడ్ రూమ్ దృశ్యాలు అందుకే సీక్రెట్‌గా వీడియో తీశా, మాజీమంత్రి రాసలీలల కేసులో సీడీ యువతి సంచలనం
ముందుగా మంత్రిని ఎప్పుడు కలిసింది? ఎందుకు కలిసింది? శారీరకంగా వాడుకున్నా ఎందుకు మౌనంగా ఉంది? బెడ్ రూమ్ దృశ్యాలు ఎందుకు వీడియో తీసింది? రాసలీలల కేసులో మరో సంచలనం.

Ramesh Jarkiholi Cd Scandal
Ramesh Jarkiholi CD Scandal : కర్నాటక రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపిన బీజేపీ నేత, మాజీ మంత్రి రమేశ్ జార్కిహొళి రాసలీలల సీడీ కేసు విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సిట్ విచారణలో సీడీలో ఉన్న యువతి అనేక విషయాలు బయటపెట్టింది. ముందుగా మంత్రిని ఎప్పుడు కలిసింది? ఎందుకు కలిసింది? శారీరకంగా వాడుకున్నా ఎందుకు మౌనంగా ఉంది? బెడ్ రూమ్ దృశ్యాలు ఎందుకు వీడియో తీసింది? ఇలాంటి ఆసక్తికర ప్రశ్నలకు ఆమె సమాధానం చెప్పింది.
విధానసౌధలో తొలి పరిచయం..
కొంతకాలం కిందట తొలిసారిగా విధానసౌధకు వెళ్లినప్పుడు మంత్రి రమేశ్ జార్కిహొళిని కలిసినట్లు సీడీ యువతి చెప్పినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో తన మొబైల్‌లో మల్లేశ్వరం పీజీ అని పేరుతో మంత్రి నెంబర్ ను సేవ్ చేయించారట. తనకు సహకరించాల్సిందిగా కోరారట. రెండు, మూడుసార్లు శారీరకంగా వాడుకున్నారట. శారీరకంగా వాడుకున్నా, తమ ప్రాంతంలో బలమైన నేత కావడంతో ఏమీ చేయలేక మౌనం దాల్చాను అని ఆ యువతి సిట్ విచారణలో చెప్పినట్లు సమాచారం. ఇక, ఎప్పుడైనా సాక్ష్యాలుగా పనికొస్తాయనే ఉద్దేశ్యంతో రమేశ్‌తో సన్నిహితంగా ఉన్న బెడ్ రూమ్ దృశ్యాలను వీడియోలు తీసినట్లు యువతి తెలిపింది. ఆ విషయాన్ని తల్లిదండ్రులకు కూడా చెప్పలేదని, కానీ తన క్లాస్‌మేట్ శ్రవణ్‌కు చెప్పినట్లు తెలిపింది. ఆ వీడియోల సీడీలను అతనితో పాటు నరేశ్ అనే మరో స్నేహితునికి ఇచ్చినట్లు, మరో కాపీని తన రూంలో ఉంచినట్లు వెల్లడించింది.
రాసలీలల సీడీ బయటపడటంతో కన్నడ రాజకీయాల్లో పెద్ద దుమారమే రేగింది. రమేశ్ జార్కిహోళి మంత్రి పదవికి రాజీనామా చేశారు. కాగా, సీడీలో ఉన్న యువతి సడెన్ గా అజ్ఞాతంలోకి వెళ్లింది. 28 రోజుల అజ్ఞాతం తర్వాత బయటకు వచ్చింది. బాధిత యువతికి బెంగళూరులోని బౌరింగ్ ఆస్పత్రిలో బుధవారం(మార్చి 31,2021) ఉదయం వైద్య పరీక్షలు చేశారు. కోవిడ్ పరీక్షలు చేయగా నెగిటివ్‌గా తేలింది. ఇన్నాళ్లూ అజ్ఞాతంలో ఉన్న యువతిని భారీ పోలీసు బందోబస్తు మధ్య బౌరింగ్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆ తర్వాత సిట్ ఆఫీసుకు తీసుకెళ్లి విచారించారు.
జడ్జితో సీక్రెట్ గా 2 గంటలు:
28 రోజులుగా కనిపించకుండా పోయిన బాధిత యువతి మంగళవారం(మార్చి 30,2021) బయటకు వచ్చింది. ఉదయం నుంచి అనేక నాటకీయ పరిణామాల మధ్య మధ్యాహ్నం ఏసీఎంఎం కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరై వాంగ్మూలాన్ని ఇచ్చింది. యువతి అత్యంత రహస్యంగా మధ్యాహ్నం 2.30 గంటలకు బెంగళూరు వసంతనగరలోని గురునానక్ భవన్‌లో ఉన్న ఏసీఎంఎం కోర్టు కాంప్లెక్స్‌లోని ప్రత్యేక కోర్టుకి చేరుకుంది. సుమారు రెండు గంటల పాటు జడ్జి ఎదుట తన వాంగ్మూలాన్ని ఇచ్చింది. ఈ ప్రక్రియనంతా వీడియో రికార్డింగ్ చేశారు. అక్కడ ఒక స్టెనోగ్రాఫర్ మాత్రమే ఉన్నారు. ఆ తరువాత కోర్టు అనుమతితో సిట్ పోలీసులు యువతిని ఆధీనంలోకి తీసుకుని తమ ఆఫీసుకు తరలించారు. మంగళవారం రాత్రి వరకూ సిట్ ఆమెను విచారించింది.
కీలక సాక్ష్యాలను సమర్పించిన యువతి?
‘తాము ఇచ్చిన మాట ప్రకారం బాధిత యువతిని కోర్టు ఎదుటకు తీసుకొచ్చాము. ఇక పోలీసులు వారి పని చేయాలి. నిందితుడు స్వేచ్ఛగా బయటకు తిరగకుండా అరెస్టు చేయాలి’ అని బాధిత యువతి న్యాయవాది జగదీశ్ డిమాండ్ చేశారు. యువతి ఎలాంటి భయం లేకుండా జరిగింది మొత్తం న్యాయమూర్తి ఎదుట తెలిపిందన్నారు. బాధిత యువతి జడ్జికి కీలక సాక్ష్యాలను అందజేసినట్లు సమాచారం.