బంపర్ బొనాంజా: రిజర్వ్ బ్యాంక్ నుంచి కేంద్రానికి రూ.1.76 లక్షల కోట్లు

  • Published By: vamsi ,Published On : August 27, 2019 / 02:48 AM IST
బంపర్ బొనాంజా: రిజర్వ్ బ్యాంక్ నుంచి కేంద్రానికి రూ.1.76 లక్షల కోట్లు

Updated On : August 27, 2019 / 2:48 AM IST

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వంకు రూ. లక్షా 76వేల లక్షల కోట్లు బదిలీ చేయనున్నట్లు ప్రకటనలో వెల్లడించింది. మందగిస్తున్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ఉద్ధేశ్యంతో ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లుగా రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి డివిడెండ్ రూపంలో రూ. లక్షా 23వేల 414 లక్షల కోట్లు ఇవ్వగా ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేమ్‌వర్క్ కింద రూ. 52వేల 637 లక్షల కోట్లు బదిలీ చేసింది. మాజీ ఆర్బీఐ గవర్నర్ బిమాల్ జలాన్ నేతృత్వంలోని కమిటీ సూచనలతో అధిక నగదు నిల్వలను కేంద్రప్రభుత్వానికి బదిలీ చేసింది రిజర్వ్ బ్యాంక్. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని సభ్యులు నగదు బదిలీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఆగస్ట్ 14వ తేదీన ఈ మేరకు నివేదిక తయారు చేసిన కమిటీకి రిజర్వ్ బ్యాంక్ అనుమతి లభించింది. రిజర్వ్ బ్యాంకు నగదు బదిలీ చేయడంతో ఐదేళ్లుగా మందకొడిగా ఉన్న ఆర్థిక వ్యవస్థ పుంజుకునే అవకాశం ఉందని ఆర్థిక వేత్తలు అంచనాలు వేస్తున్నారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు మిగులును తమకు ఇవ్వాలంటూ ఎన్నోరోజుల నుంచి కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యంకును కోరుతుంది. ఈ క్రమంలోనే నిర్ణయం తీసుకున్న ఆర్బీఐ బోర్డు మిగులు నిధులను ప్రభుత్వానికి ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. శక్తికాంత దాస్ ఆర్బీఐ గవర్నర్ అయినప్పటి నుంచి మిగులు నగదును ఆర్బీఐ బదిలీ చేస్తూ వస్తోంది.