మధ్యప్రదేశ్ సీఎంగా… నేడే శివరాజ్ సింగ్ ప్రమాణస్వీకారం

ఇవాళ(మార్చి-23,2020)సాయంత్రం 7గంటలకు మధ్యప్రదేశ్ సీఎంగా శివరాజ్ సింగ్ ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. జ్యోతిరాధిత్య సింధియా వర్గానికి చెందిన 22మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాతో మెజార్టీ కోల్పోయిన కమల్ నాథ్..గత గురువారం బలపరీక్షను ఎదుర్కోకముందే సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
2018 డిసెంబర్ లో ఎస్పీ,బీఎస్పీ, ఇండిపెండెంట్ల మద్దుతులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కమల్ నాథ్…రెబల్ ఎమ్మెల్యేలను బుజ్జగించడంలో విఫలమవడంతో బలపరీక్షకు వెళ్లకుండానే తన సీఎం పదవికి రాజీనామా చేశాడు.
కాంగ్రెస్ కు రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు ఆదివారం బీజేపీలో చేరినట్లు 18సంవతర్సాలు కాంగ్రెస్ తో ఉన్న అనుబంధాన్ని తెంచుకుని,ఇటీవల బీజేపీలో చేరిన జ్యోతిరాధిత్య సింధియా నిన్న ట్వీట్ చేశారు. కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదించినట్లు ఇప్పటికే స్పీకర్ ఎన్ ప్రజాపతి ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ సమయంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మద్దుతు ఉన్న బీజేపీ ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రెడీ అయింది. నాలుగోవసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ ఇవాళ పగ్గాలు చేపట్టనున్నారు.
Also Read | కరోనా దెబ్బ తట్టుకునేందుకు…ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించనున్న కేంద్రం