Viral Video : ఓ మై గాడ్.. బర్త్ డే పార్టీలో ఊహించని ప్రమాదం, మంటల్లో బర్త్‌డే బాయ్.. మీరు ఇలాంటి తప్పు అస్సలు చేయొద్దు

Viral Video : ఊహించని ప్రమాదంతో ఒక్కసారిగా అక్కడున్న వారంతా షాక్ కి గురయ్యారు. భయాందోళన చెందారు. లక్కీగా స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.

Viral Video : ఓ మై గాడ్.. బర్త్ డే పార్టీలో ఊహించని ప్రమాదం, మంటల్లో బర్త్‌డే బాయ్.. మీరు ఇలాంటి తప్పు అస్సలు చేయొద్దు

Viral Video (Photo : Google)

Updated On : June 19, 2023 / 9:35 PM IST

Viral Video – Birthday Party : బర్త్ డే అంటేనే.. సెలబ్రేషన్స్. కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులతో కలిసి పుట్టిన రోజు వేడుకలను ఓ రేంజ్ లో జరుపుకుంటారు. సెలబ్రేషన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కచ్చితంగా పార్టీ అరేంజ్ చేయాల్సిందే, కేక్ కట్ చేయాల్సిందే. ఇక, బర్త్ డే వేడుకల్లో ఫ్రెండ్స్ చేసే అల్లరి అంతా ఇంతా కాదు.

సెలబ్రేషన్స్ ఓ రేంజ్ లో ఉంటాయంతే. క్యాండిల్స్ వెలిగించడం, స్ప్రే కొట్టడం, కేక్ ముఖానికి పూయడం.. వారి హంగామా మామూలుగా ఉండదు. అయితే, సెలబ్రేషన్స్ విషయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. లేదంటే వేడుక కాస్తా విషాదంగా మారే చాన్స్ ఉంది. ప్రాణాలకే ప్రమాదం ఏర్పడొచ్చు. అదే చివరి బర్త్ డే కావొచ్చు. ఇలా చెప్పడానికి కారణం లేకపోలేదు. ఓ బర్త్ డే వేడుకలో తృటిలో ప్రమాదం తప్పింది. బర్త్ డే బాయ్ కు మంటలు అంటుకున్నాయి. లక్కీగా స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.(Viral Video)

మహారాష్ట్ర వార్దాలోని సింధీ మేఘీ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం షాకింగ్ ఘటన జరిగింది. హృతిక్ వాంఖడే అనే యువకుడిది బర్త్ డే. దాంతో అతడి ఇంట్లో కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, ఫ్రెండ్స్ సమక్షంలో బర్త్ డే వేడుకలు ఏర్పాటు చేశారు. బర్త్ డే బాయ్ కేక్ కట్ చేశాడు. ఇక, అంతే ఫ్రెండ్స్ నానా హంగామా చేశారు.

Also Read..Heart Attack : ఈ గుండెకి ఏమైంది? బైక్ నడుపుతూ గుండెపోటుతో అక్కడికక్కడే మృతి, వీడియో వైరల్

కొందరు అతడి ముఖంపై స్ప్రే చేస్తున్నారు. మరో ఇద్దరు ఫ్రెండ్స్ ఫైర్ గన్ తో గాల్లో ఫైర్ చేస్తున్నారు. ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. ఫ్రెండ్స్ హృతిక్ పై స్ప్రే చేస్తుండగా.. ఫైర్ గన్ నుంచి నిప్పురవ్వులు ఎగిసిపడ్డాయి. ఆ నిప్పు రవ్వలు, స్ప్రేను తాకాయి. దాంతో హృతిక్ కు మంటలు అంటుకున్నాయి. అతడి ముఖం, జుట్టుపై మంటలు చెలరేగాయి. ఊహించని ప్రమాదంతో ఒక్కసారిగా హృతిక్ తో పాటు అక్కడున్న వారంతా షాక్ కి గురయ్యారు. భయాందోళన చెందారు.

వెంటనే స్పందించిన హృతిక్ చేత్తో మంటలు ఆర్పివేసుకున్నాడు. దాంతో పెద్ద ప్రమాదమే తప్పింది. స్వల్ప గాయాలతో బర్త్ డే బాయ్ బయటపడ్డాడు. ఈ ఘటనలో అతడి ముఖం, చేతులకు గాయాలయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read..Karnataka : OMG.. పెట్రోల్ బంకులో ఫోన్ వాడుతున్నారా? ఎంత ప్రమాదమో చూడండి.. ఒళ్లుగగుర్పొడిచే వీడియో

బర్త్ డే వేడుకల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పడానికి ఇదో పెద్ద నిదర్శనం. మరీ ముఖ్యంగా స్ప్రేలు, ఫైర్ గన్లతో చాలా కేర్ ఫుల్ గా ఉండాలి. స్ప్రేలు మండే స్వభావం కలిగుంటాయి. ఏ మాత్రం తేడా జరిగినా వెంటనే మంటలు అంటుకుంటాయి. అంతేకాదు.. స్ప్రే అనేది కెమికల్. అది కళ్లలో పడితే కళ్లకు ప్రమాదం కలగొచ్చు. కంటి చూపును కోల్పోయే చాన్స్ ఉంది. అందుకే, సెలబ్రేషన్స్ ఏవైనా.. కాస్త జాగ్రత్తగా చేసుకోవడం చాలా బెటర్. లేదంటే, వేడుక కాస్తా విషాదంగా మార్చే అవకాశం ఉంది. మీరు మాత్రం, మీ వేడుకల్లో ఇలాంటి పొరపాట్లు అస్సలు చేయొద్దు.